Interlink Power Supply | ఇంటర్​లింక్​ వ్యవస్థతో నిరంతరాయంగా విద్యుత్​ సరఫరా: ట్రాన్స్​కో ఎస్​ఈ

వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు ఇంటర్​లింక్​ విధానాన్ని అమలు చేస్తున్నామని ట్రాన్స్​కో ఎస్ఈ పీవీ రాజేశ్వర్​రావు తెలిపారు.

Shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Interlink Power Supply | వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు ఇంటర్​లింక్​ విధానాన్ని అమలు చేస్తున్నామని ట్రాన్స్​కో ఎస్ఈ పీవీ రాజేశ్వర్​రావు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు.

Interlink Power Supply | సబ్​స్టేషన్​లలో విద్యుత్​ సరఫరా నిలిచిపోతే..

ఏదైనా ఒక సబ్​స్టేషన్​ (Substation)లో, ప్రధాన లైన్​లలో ప్రకృతి వైపరీత్యాలు, గాలివానలు, వరదలు, అత్యవసర మరమ్మతులు కారణంగా సరఫరా నిలిచిపోయే అవకాశం ఉంటుందన్నారు. ఆ సమయంలో వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఆధునిక ఇంటర్ లింక్​లైన్ (అనుసంధాన) వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

Interlink Power Supply | ఇంటర్​ లింక్​  వ్యవస్థ ఏమిటంటే..

సాధారణంగా ఒక విద్యుత్ లైన్​లలో లోపం ఏర్పడితే ఆ పరిధిలోని వినియోగదారులకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. అయితే ఇంటర్​లింక్​ లైన్ వ్యవస్థ ద్వారా ఒక 33/11 కేవీ సబ్​స్టేషన్​ నుంచి మరో 33/11 కేవీ సబ్​స్టేషన్​కు అనుసంధానం చేస్తారన్నారు. అలాగే ఒక 33/11 కేవీ సబ్​స్టేషన్​కు సమీపంలోని 132/33 కేవీ సబ్​స్టేషన్​కు, అలాగే ఒక 33 కేవీ లైన్​ను మరో 33 కేవీ లైన్​కు అనుసంధానం చేస్తారన్నారు. దీంతో ఒక మార్గంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సందర్భంలో వెంటనే ప్రత్యామ్నాయ మార్గం ద్వారా విద్యుత్​ సరఫరా జరుగుతుందన్నారు. దీంతో వినియోగదారులకు విద్యుత్ అంతరాయాలు గణనీయంగా తగ్గడమే కాకుండా, అత్యవసర పరిస్థితుల్లో కూడా నిరంతరాయ విద్యుత్ సరఫరా కొనసాగుతుంది.

Interlink Power Supply

Interlink Power Supply | సర్కిల్లో సాధించిన పురోగతి..

సర్కిల్ పరిధిలో ఉన్న 70 33/11 కేవీ సబ్ స్టేషన్లలో ఇంటర్​ లింకింగ్​ లైన్ల నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేశామని సూపరింటెండింగ్ ఇంజినీర్ తెలిపారు. ఈ వ్యవస్థ అమలుతో గోవిందపెట్ నుండి జానకంపేట, కమలాపూర్ నుండి జన్నెపల్లి, దండిగుట్ట నుండి నీలా, రాంపూర్ నుండి పాల్దా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అంతరాయాలు తగ్గాయని వివరించారు. అదేవిధంగా మరో 33 కేవీ లైన్ల మధ్య కూడా ఇంటర్​ లింకింగ్​ వ్యవస్థను ఏర్పాటు చేశామని, దీంతో విద్యుత్ సరఫరాలో మరింత స్థిరత్వం సాధించగలిగామని పేర్కొన్నారు.

Interlink Power Supply | మిగిలిన ప్రాంతాల్లోనూ..

మిగిలిన ప్రాంతాల్లో కూడా ఈ వ్యవస్థను విస్తరించేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించి దశలవారీగా అమలు చేస్తున్నామని ఎస్​ఈ వెల్లడించారు. వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించేందుకు విద్యుత్ శాఖ నిరంతరం కృషి చేస్తోందని ఆయన స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి..: Congress Booth Training | 10న కాంగ్రెస్​ బూత్​లెవల్​ ఏజెంట్లకు శిక్షణ

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *