Nepal Gang Gold Theft | మరోసారి రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్​.. కిలో బంగారం చోరీ

గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ విల్లాలో నివాసం ఉంటున్న ఓ వ్యాపారవేత్త ఇంట్లో భారీ చోరీ జరిగింది. నేపాల్​కు చెందిన ముఠా ఈ పని చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal Gang Gold Theft | హైదరాబాద్ (Hyderabad)​లో నేపాలీ గ్యాంగ్​లు రెచ్చిపోతున్నాయి. భారీ చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్​ విసురుతున్నాయి. ధనవంతుల ఇళ్లే లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నాయి. తాజాగా గచ్చిబౌలిలో కిలో బంగారు ఆభరణాలను నేపాల్​కు చెందిన ముఠా సభ్యులు చోరీ చేశారు.

గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ విల్లాలో నివాసం ఉంటున్న ఓ వ్యాపారవేత్త ఇంట్లో భారీ చోరీ జరిగింది. వీరి ఇంట్లో పని చేసే నేపాల్​ దంపతులు ఈ పని చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరు సదరు వ్యాపారవేత్త ఇంట్లో నెల రోజుల క్రితం పనికి కుదిరారు. ఆయన కుటుంబంతో కలిసి ఇటీవల ముంబై వెళ్లాడు. ఆదివారం తిరిగి వచ్చాడు. అప్పటికే నేపాల్ దంపతులు కనిపించలేదు. దీంతో వారు చెప్పకుండా వెళ్లిపోయారని ఆయన భావించాడు.

Nepal Gang Gold Theft | ఇంట్లో చూడగా..

వ్యాపారి తన ఇంట్లో గమనించగా.. పూజ గదిలో దేవుడి మెడలో ఉన్న బంగారు గొలుసుతో పాటుమరికొన్ని ఆభరణాలు మాయమైనట్లు గుర్తించాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలిస్తున్నారు. సుమారు కిలో బంగారం, వజ్రాలు చోరీ అయినట్లు తెలుస్తొంది.

Nepal Gang Gold Theft | వరుస ఘటనలు

నగరంలో నేపాలీ గ్యాంగ్​లు (Nepali Gangs) దోపిడీలు, చోరీలతో రెచ్చిపోతున్నాయి. గత నెలలో రిటైర్డ్​ ఐపీఎస్​ అధికారి వినయ్​ రంజన్​ రే భార్య తనూజను నేపాల్​ గ్యాంగ్ హత్య చేసిన విషయం తెలిసిందే. ఆమెను హత్య చేసి ఇంట్లోని నగలు, నగదుతో నిందితులు పారిపోయారు. అనంతరం కొద్ది రోజులకే జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ (Jawahar Nagar Police Station) పరిధిలోని గల్ఫ్ ఎంక్లేవ్‌లో నివాసం ఉండే డా. విజయలక్ష్మి, మురళీమోహన్ దంపతులకు మత్తు మందు ఇచ్చి, కాళ్లు చేతులు కట్టేసి నేపాలి ముఠా దోపిడీకి పాల్పడింది. 60 తులాల బంగారం, రూ. 30 వేలు దొంగలించినట్లు బాధితులు తెలిపారు. జన్మదిన వేడుకలు చేసుకుంటామని చెప్పి, ఆ దంపతులపై దాడి చేసి దోపిడీ చేశారు.

Nepal Gang Gold Theft | పోలీసులు చెబుతున్నా..

దేశంలోని ప్రధాన నగరాల్లో నేపాల్​ గ్యాంగ్​లు దోపిడీలు, చోరీలకు పాల్పడుతున్నాయి. వీరు మొదట పని మనుషులుగా వచ్చి ఇంట్లో చేరుతున్నారు. మొదట్లో నమ్మకస్తులుగా పని చేస్తున్నారు. అనంతరం ఇంట్లో ఎవరు లేని సమయంలో చోరీలు చేస్తున్నారు. యజమానులు ఒంటరిగా ఉన్న సమయంలో వారిపై దాడి చేసి డబ్బులు ఎత్తుకెళ్తున్నారు. ధనవంతులు, వ్యాపారస్తులు, రిటైర్డ్​ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. నగరంలో ఇలాంటి ఘటనలు ఐదు వరకు జరిగాయి. దీంతో పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. నేపాలీ పని మనుషుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవగాహన కల్పిస్తూ పోస్టర్లు అతికించారు. అయినా ఇంకా పలువురు నేపాల్​కు చెందిన వారిని పనిలో పెట్టుకుంటున్నారు.

ఇది కూడా చదవండి..: Hyderabad Development Projects | రూ.1,674.74 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *