Innova Crysta 2026 | కొత్త హంగులతో ఇన్నోవా క్రిస్టా రీలాంచ్..

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎంపీవీలలో ఒకటైన టయోటా ఇన్నోవా క్రిస్టా కొత్త హంగులతో మళ్లీ వచ్చింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Innova Crysta 2026 | రెండు దశాబ్దాలపాటు భారతీయుల మనసు దోచుకున్న టయోటా ఇన్నోవా క్రిస్టాను టయోటా కిర్లోస్కర్ మోటార్ కొత్త హంగులతో మళ్లీ తీసుకువచ్చింది. 2026 మోడల్ ను లాంచ్ చేసింది.

పాత క్రిస్టాలో ఎక్స్‌టర్నల్ తోపాటు ఇంటీరియర్ మార్పులు చేసి సరికొత్త ఫీచర్లతో దీనిని తీసుకువచ్చారు. అయితే 2027లో ఈ మోడల్ ప్రొడక్టును నిలిపివేయనున్నారు. ఇన్నోవా క్రిస్టా (Innova Crysta)కు ఇదే చివరి అప్‌డేట్ కావచ్చని భావిస్తున్నారు. కొత్త ఇన్నోవా క్రిస్టా 2026 మోడల్ ప్రారంభ ధర(ఎక్స్ షోరూమ్)ను రూ.19.72 లక్షలుగా నిర్ణయించారు.

Innova Crysta 2026 | ఎక్స్‌టర్నల్ డిజైన్..

ఫ్రంట్ డిజైన్ గతంలోకన్నా మరింత ఆకర్షణీయంగా మారింది. ఇందులో క్రోమ్ ఫినిషింగ్‌తో కొత్త గ్రిల్ ఉంది. ఇది ప్రీమియం లుక్‌ను అందిస్తుంది. ఫ్రంట్, బ్యాక్ బంపర్ కూడా అప్‌డేట్ చేశారు. అలాగే అదనపు క్రోమ్ ఎలిమెంట్లను జోడించారు. ఈ మార్పులు మినహా, కారు మొత్తం డిజైన్, బాడీ ప్రొఫైల్ పాతదానిలాగే ఉంది.

Innova Crysta 2026 | ఇంటీరియర్ ఫీచర్లు..

క్యాబిన్‌లోనూ పలు మార్పులు జరిగాయి. డ్యుయల్ టోన్ లెదర్ సీట్ , గ్రేస్ కాపర్ ఫినిష్ ట్రిమ్స్, వుడ్ ప్యాటర్న్ ఇన్‌సర్ట్‌లతో డ్యాష్‌బోర్డ్, డోర్ ప్యానెల్స్ మరింత విలాసవంతంగా కనిపిస్తున్నాయి. ఏసీ కంట్రోల్ ప్యానెల్ స్విచ్‌గేర్‌ను కూడా అప్‌డేట్ చేసింది. వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ చార్జర్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ వంటివి ఎంపిక చేసిన వేరియంట్లలో లభిస్తాయి. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉన్నాయి.భద్రత కోసం 7 ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, బ్రేక్ అసిస్ట్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ వంటివి ఉన్నాయి.

Innova Crysta 2026 | ఇంజిన్ ఆప్షన్లు..

కొత్త ఇన్నోవా క్రిస్టాలో కూడా సాధారణ ఇన్నోవాలోని అదే 2.4 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ 148 బీహెచ్పీ పవర్, 343 ఎనఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. లీటరుకు గరిష్టంగా 15 కి.మీ. మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

వేరియంట్లు.. ధరలు..

టయోటా కొత్త ఇన్నోవా క్రిస్టాను పలు వేరియంట్‌లలో అందిస్తోంది. ఆ వేరియంట్లు ధరలిలా ఉన్నాయి.
జీఎక్స్ ఫ్లీట్ – 7 సీటర్ : రూ. 19.72 లక్షలు
జీఎక్స్- 7 సీటర్ : రూ. 19.72 లక్షలు
జీఎక్స్- 8 సీటర్ : రూ. 19.77 లక్షలు
జీఎక్స్ ప్లస్ – 7 సీటర్ : రూ. 21.15 లక్షలు
జీఎక్స్ ప్లస్ – 8 సీటర్ : రూ. 21.20 లక్షలు
వీఎక్స్- 7 సీటర్ : రూ. 24.93 లక్షలు
వీఎక్స్- 8 సీటర్ : రూ. 24.98 లక్షలు
జెడ్ ఎక్స్- 7 సీటర్ : రూ. 26.63 లక్షలు

ఇది కూడా చదవండి..: June 09 Gold Prices | బులియన్ మార్కెట్ అప్‌డేట్ : మరింత తగ్గిన పసిడి, వెండి ధరలు!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *