అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nadendla Bhaskara Rao | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు(90) కన్నుమూశారు. కొన్ని రోజులుగా హైదరాబాద్ (Hyderabad)లో చికిత్స పొందుతున్న ఆయన నేడు తుది శ్వాస విడిచారు.
నాదెండ్ల భాస్కర్ రావు వయో సంబంధిత సమస్యలతో కాంటినెంటల్ హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన పార్థివదేహాన్ని జూబ్లీహిల్స్ (Jubilee Hills)లోని నివాసంలో ఉంచనున్నారు. పంజాగుట్ట హిందూ శ్మశానవాటికలో గురువారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Nadendla Bhaskara Rao | నెల రోజులు సీఎంగా..
నాదెండ్ల భాస్కర రావు 1935 జూన్ 23న జన్మించారు. కాంగ్రెస్ నుంచి ఆయన తన రాజకీయ జీవితాన్ని ఆరంభించారు. 1978లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అనంతరం చెన్నారెడ్డి (Chennareddy) మంత్రివర్గంలో పని చేశారు. తర్వాత ఎన్టీఆర్ టీడీపీ (TDP) ఏర్పాటు సమయంలో నాదెండ్ల కాంగ్రెస్‌ను వీడారు. తెలుగు దేశం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. 1983లో టీడీపీ గెలిచిన అనంతరం ఆయన ఆర్థిక మంత్రిగా పని చేశారు. అయితే 1984లో అప్పటి సీఎం ఎన్టీఆర్ ఆపరేషన్ కోసం అమెరికా వెళ్లారు. ఆ సమయంలో నాదెండ్ల కాంగ్రెస్‌తో కలిసి ఎన్టీఆర్‌పై తిరుగుబాటు చేశారు. పార్టీని చీల్చి కాంగ్రెస్ సాయంతో సీఎం అయ్యారు. అనంతరం ఎన్టీఆర్ పెద్ద ఎత్తున ఉద్యమం చేయడంతో నాదెండ్ల రాజీనామా చేశారు. దాదాపు నెల రోజులు ఆయన సీఎంగా వ్యవహరించారు.

Nadendla Bhaskara Rao | కాంగ్రెస్‌లోకి..
ఎన్టీఆర్ మళ్లీ సీఎం అయ్యాక.. నాదెండ్లను టీడీపీ నుంచి బహిష్కరించారు. దీంతో ఆయన కాంగ్రెస్‌లో చేరారు. 1989లో తెనాలి ఎమ్మెల్యేగా, 1998 ఖమ్మం ఎంపీగా గెలిచారు. తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్ గతంలో కాంగ్రెస్‌లో ఉన్నారు. జనసేన ఏర్పాటులో ఆయన కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఏపీ మంత్రిగా పని చేస్తున్నారు.
దీనిని కూడా చదవండి : Chandrababu Comments | రేవంత్‌రెడ్డికి అవగాహన లేదు.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

