Constable Heart Attack | గుండెపోటుతో మరో కానిస్టేబుల్​ మృతి.. పోలీస్​శాఖలో కలవరపెడుతున్న వరుస ఘటనలు

పోలీస్​శాఖలో వరుస గుండెపోటు ఘటనలు కలవరపెడుతున్నాయి. రెండో రోజుల్లో ఇద్దరు సిబ్బంది హార్ట్​ఎటాక్​తో మరణించారు.

Shashi kiran Mottala

అక్షరటుడే, గాంధారి: Constable Heart Attack | పోలీస్​శాఖలో వరుస గుండెపోటు ఘటనలు కలవరపెడుతున్నాయి. నిజామాబాద్​ జిల్లా (Nizamabad District)లో సోమవారం విధుల్లో ఉండగానే ఓ హెడ్​ కానిస్టేబుల్​ గుండెపోటుతో మృతి చెందగా.. మంగళవారం గాంధారి మండలంలో మరో కానిస్టేబుల్​ హార్ట్​ ఎటాక్​తో మరణించాడు.

Constable Heart Attack | గాంధారి మండల కేంద్రంలో..

మండల కేంద్రంలోని పోలీస్​స్టేషన్​లో గత రెండేళ్లుగా విధులు నిర్వహిస్తున్న రఘు(44) సోమవారం నైట్ డ్యూటీ నిర్వహించాడు. అనంతరం మంగళవారం ఉదయం రిలీవ్​ అయి స్వగ్రామమైన బాన్సువాడలో ఇంటికి చేరుకున్నాడు. కాలకృత్యాలు తీర్చుకున్న అనంతరం చాతిలో నొప్పి వస్తుందని కుటుంబీకులకు తెలపడంతో వారు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లుగా వైద్యులు పేర్కొన్నారు. రఘుకు భార్య ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని తోటి సిబ్బంది తెలిపారు. గాంధారి మండల కేంద్రంలో రెండేళ్లుగా విధులు నిర్వహిస్తూ సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నారు. కానిస్టేబుల్​ మృతిపై ఎస్సై మహేందర్​, ఎస్సై ఆంజనేయులు, సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి..: Locker Theft | నగరంలో దొంగల హల్​చల్​.. లాకర్​తో పరారు

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *