అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nomination Rejection | కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) నామినేషన్‌ను ఎన్నికల సంఘం తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో ఢిల్లీలోని ఈసీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు.
మీనాక్షి నామినేషన్ తిరస్కరణపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన కాంగ్రెస్ నేతల బృందం ఈసీ కార్యాలయానికి వెళ్లింది. జైరాంరమేష్‌తో పాటు కాంగ్రెస్ నేతలను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో సెక్యూరిటీ సిబ్బందితో జైరాంరమేష్ వాగ్వాదం చేశారు. ఈసీ ఆఫీసు ఎదుట బైఠాయించి కాంగ్రెస్ నేతలు కేసీ వేణుగోపాల్, జైరాంరమేష్, సచిన్ పైలట్ తదితరులు ఆందోళన చేపట్టారు.
Nomination Rejection | ఇక్కడే కూర్చుంటాం
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ (KC Venugopal) మాట్లాడుతూ… ఇది ప్రజాస్వామ్యానికి సంబంధించిన ప్రాథమిక అంశం అన్నారు. తమను లోపలికి అనుమతించే వరకు ఇక్కడే కూర్చుంటామని స్పష్టం చేశారు. సచిన్ పైలెట్ మాట్లాడుతూ.. మీనాక్షి నటరాజన్‌పై ఎలాంటి ఎఫ్‌ఐఆర్ (FIR)లు, ఛార్జ్‌షీట్లు లేన్నారు. కారణం లేకుండానే తమ అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించారని మండిపడ్డారు. తాము గెలిచే అవకాశం ఉన్న స్థానానికి సంబంధించిన అభ్యర్థి నామినేషన్ రద్దు అయిందన్నారు.
Nomination Rejection | స్పందించిన మీనాక్షి నటరాజన్
తన నామినేషన్ తిరస్కరణకు గురి కావడంపై కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ స్పందించారు. సంఖ్యా బలం లేనప్పటికీ అధికారంలో ఉన్న బీజేపీ మూడో అభ్యర్థిని బరిలోకి దించడంతోనే ఇదంతా మొదలైందన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాలరాసేలా వారు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంతో బీజేపీ రాజనీతి ఏంటో అందరికి అర్థమైందన్నారు. దేశంలో ఏక పార్టీ వ్యవస్థను తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
#WATCH | Delhi: Congress leaders Jairam Ramesh, KC Venugopal, Bhupesh Baghel, Sachin Pilot and others arrive at the office of the Election Commission of India after the nomination of Madhya Pradesh Congress Rajya Sabha candidate Meenakshi Natrajan was rejected. pic.twitter.com/XAMS1c94C2
— ANI (@ANI) June 9, 2026
దీనిని కూడా చదవండి : Meenakshi Natarajan Nomination | రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
