అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Development Works | నగరంలోని ప్రతి డివిజన్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని మేయర్ ఉమారాణి (Mayor Umarani) పేర్కొన్నారు. 49వ డివిజన్‌లో బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు.
Nizamabad Development Works | తాగునీటి సరఫరా పరిశీలన
నగరంలోని 49వ డివిజన్‌లో డ్రెయినేజీ, తాగునీటి సరఫరాను మేయర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. డివిజన్‌లోని ఆయా కాలనీలను సందర్శించిన మేయర్.. కాలనీవాసులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం, తాగునీటి సరఫరాలో ఏర్పడుతున్న సమస్యలు, రోడ్ల దుస్థితి కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రత్యేకంగా ఆరా తీశారు. అనంతరం ఏఎంసీ నజీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పేర్రాజు, సానిటరీ ఇన్స్పెక్టర్ మహిపాల్‌తో మాట్లాడి సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.
Nizamabad Development Works | నగరాభివృద్ధే ప్రధాన లక్ష్యంగా..
మేయర్ మాట్లాడుతూ.. నగర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ప్రతి డివిజన్‌లో మౌలిక వసతుల మెరుగుదలకు కృషి చేస్తున్నామని అన్నారు. ప్రజల సహకారంతో నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో రాజీ లేకుండా, క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (Nizamabad Municipal Corporation) కట్టుబడి ఉందన్నారు.
ఇది కూడా చదవండి..: Nizamabad Electric Bus | సాంకేతిక లోపంతో ఆగిన ఎలక్ట్రిక్ బస్సు.. సీపీ ఆఫీస్ వద్ద ట్రాఫిక్‌జాం
