Nanakramguda Drug Bust | కిరాణా షాపులో గంజాయి దందా.. గుట్టురట్టు చేసిన ఈగల్ టీం

Shivam nagarani

అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nanakramguda Drug Bust | నగరంలోని ఐటీ కారిడార్‌లో డ్రగ్స్, గంజాయి ముఠాలపై ఈగల్ టీం( Eagle Team ) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నానక్‌రామ్‌గూడ కేంద్రంగా సాగుతున్న భారీ గంజాయి నెట్‌వర్క్‌ను అధికారులు ఛేదించారు. కిరాణా దుకాణం ముసుగులో సాగిస్తున్న ఈ అక్రమ దందాలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Nanakramguda Drug Bust | ఈగల్ ఫోర్స్ నిఘా విభాగం

నానక్‌రామ్‌గూడలో నీతూ భాయ్ అనే వ్యక్తి కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. అయితే, ఆ షాపు ముసుగులో గంజాయి, డ్రగ్స్ విక్రయాలు సాగిస్తున్నట్లు ఈగల్ ఫోర్స్ నిఘా విభాగం గుర్తించింది. నైట్ షిఫ్ట్ చేసే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే లక్ష్యంగా ఈ దందా సాగుతోంది. గంజాయి విక్రయాల ద్వారా నీతూ భాయ్ రోజుకు రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షల వరకు సంపాదిస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

Nanakramguda Drug Bust | రెడ్ హ్యాండెడ్‌గా 50 మంది ఉద్యోగులు

ఈగల్ టీం అధికారులు పక్కా ప్రణాళికతో నీతూ భాయ్ నివాసం, దుకాణంపై ఒకేసారి దాడులు చేశారు. ఈ మెరుపు దాడిలో గంజాయి కొనుగోలు చేస్తూ, సేవిస్తూ ఉన్న సుమారు 50 మంది ఐటీ ఉద్యోగులను అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీరంతా గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లోని ప్రముఖ ఎంఎన్‌సీల్లో పనిచేస్తున్నట్లు సమాచారం.

Nanakramguda Drug Bust | పరారీలో ప్రధాన నిందితుడు

గతంలో ఇదే కేసులో పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయిన నీతూ భాయ్, ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చాడు. మళ్లీ అదే దందా మొదలుపెట్టగా, తాజాగా జరిగిన దాడుల గురించి సమాచారం అందుకున్న నిందితుడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు. పరారీలో ఉన్న నీతూ భాయ్ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు ముమ్మరం చేశాయి. ఐటీ కారిడార్‌లో మాదకద్రవ్యాల సరఫరా చేసే నెట్‌వర్క్‌లపై కఠిన చర్యలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Amaravati CGO Complex | అమరావతిలో కేంద్రం కీలక ప్రాజె

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *