Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - తెలంగాణ

తెలంగాణ

Singareni Achievement | సింగరేణి అరుదైన ఘనత.. డోర్లీ–2 గనిలో అడవిని పెంచిన సంస్థ

సింగరేణి సంస్థ పర్యావరణ పరిరక్షణలో అరుదైన ఘనత సాధించింది. బెల్లంపల్లి ఏరియాలోని డోర్లీ-2 గనిని పచ్చని అడవిలా మార్చింది.

Srinivas Kolluri
Last updated: June 10, 2026, 7:42 pm 7:42 pm
Srinivas Kolluri
Share
Singareni Achievement

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Singareni Achievement | సింగరేణి సంస్థ పర్యావరణ పరిరక్షణలో అరుదైన ఘనత సాధించింది. బెల్లంపల్లి (Bellampalli) ఏరియాలోని డోర్లీ-2 గని మూసివేతలో పర్యావరణ నిబంధనలను పక్కాగా అమలు చేసింది. గని మూసివేసిన ప్రాంతంలో అడవిని అభివృద్ధి చేసింది.

పర్యావరణ ప్రమాణాలను పాటించినందుకు SCCLను కేంద్రం అభినందించింది. కేంద్ర ఏజెన్సీ రూ.40 కోట్ల ఎస్క్రో డిపాజిట్‌ను వడ్డీతో సహా వాపసు చేసింది. సింగరేణి 2013-14లో బెల్లంపల్లి ప్రాంతంలోని డోర్లీ-2 ఓపెన్‌కాస్ట్ గని కోసం అనుమతులు పొందింది. నిబంధనల ప్రకారం, పర్యావరణ, గని మూసివేత కార్యకలాపాల అమలు కోసం కంపెనీ కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ పేరు మీద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సుమారు రూ. 26.79 కోట్లు డిపాజిట్ చేసింది.

Singareni Achievement | ఏడేళ్లు ఉత్పత్తి

ఈ బొగ్గు గనిలో ఏడు సంవత్సరాలు ఉత్పత్తి చేపట్టారు. 2023-24లో గనిని మూసివేశారు. బొగ్గు తవ్వే సమయంలో, మూసివేత అనంతరం పర్యావరణ నిబంధనలను సింగరేణి పక్కాగా అమలు చేసింది. గనులు తవ్విన ప్రాంతంలో సంస్థ 162.517 హెక్టార్ల విస్తీర్ణంలో దట్టమైన అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది. గనుల తవ్వకం ముందు ఉన్న దట్టమైన అడవితో పోల్చదగిన పచ్చదనాన్ని సమర్థవంతంగా పునరుద్ధరించింది.

Singareni Achievement | మట్టి పునర్వినియోగం

గని తవ్వక ముందు సుమారు 19.76 లక్షల క్యూబిక్ మీటర్ల సారవంతమైన పైమట్టిని సింగరేణి జాగ్రత్తగా తొలగించింది. వేరే ప్రాంతంలో దానిని నిల్వ చేసింది. ఈ పైమట్టిని తరువాత ఓవర్‌బర్డెన్ డంప్‌లపై పరచి, మొక్కలు నాటారు. దీంతో ఆ మొక్కలు నేడు చెట్లుగా పెరిగి పచ్చదనం పరుచుకుంది. మైనింగ్​ సమయంలో వాయు, జల కాలుష్యం నివారణకు సంస్థ చర్యలు చేపట్టింది.

open cast mine
మూసివేత సమయంలో డోర్లీ–2 గని

Singareni Achievement | త్వరలో మరో రూ.60 కోట్లు రిటర్న్​

అనేక ఇతర గనులలో కూడా మూసివేతకు సంబంధించిన పనులు పూర్తయ్యాయని సింగరేణి పేర్కొంది. ఆ గనులకు సంబంధించిన ఎస్క్రో డిపాజిట్ వాపసులను త్వరలో అందుకుంటామని ఆశిస్తోంది. డోర్లీ-1 గనికి సంబంధించిన తనిఖీలు కూడా తుది దశలో ఉన్నాయని వెల్లడించింది. ఆ గనికి సంబంధించి కూడా రూ. 60 కోట్లకు పైగా ఎస్క్రో డిపాజిట్ల వాపసును త్వరలో అందుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

 దీనిని కూడా చదవండి : NBK 111 Glimpse | మాస్​ లుక్​లో అదరగొట్టిన బాలకృష్ణ.. ఎన్​బీకే 111 గ్లింప్స్​ రిలీజ్​

TAGGED:Bellampalli NewsDorli 2 MineEnvironmental ConservationForest RestorationMine ClosureSCCLSingareni AchievementTelangana Industry
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Bada Ram Mandir | Bada Ram Mandir | ముగిసిన బడారాంమందిర్​ ఆలయ భూముల కౌలు ప్రక్రియ
Next Article Parama Ekadashi 2026 Parama Ekadashi 2026| మూడేళ్లకు ఒకసారి వచ్చే పరమ ఏకాదశి.. ఈ ఒక్క వ్రతంతో కష్టాలన్నీ దూరం
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Other Duty Facility
తెలంగాణ

Other Duty Facility | పలు సంఘాల అధ్యక్షులకు ‘ఓడీ’ సౌకర్యం కల్పించిన ప్రభుత్వం

By Srinivas Kolluri
Battery Fan Blast
తెలంగాణమెదక్

Battery Fan Blast| మెదక్ జిల్లాలో ప్రమాదం.. బ్యాటరీ పేలి తెగిపడిన బాలుడి వేళ్లు !

By Shivam nagarani
ponnam prabhakar
తెలంగాణజాతీయం

Ponnam Prabhakar | దేశంలో నియంతృత్వానికి తావులేదు : మంత్రి పొన్నం ప్రభాకర్​

By admin
KTR Congress Comments
తెలంగాణ

KTR Congress Comments | ప్రజలు కాంగ్రెస్​ను బంగాళాఖాతంలో పడేస్తారు : కేటీఆర్​

By Srinivas Kolluri
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.