Jagan Cockroach Remarks | గుర్తుపెట్టుకో.. కాక్రోచ్‌లు లేస్తాయి.. వైఎస్​ జగన్ సంచలన వ్యాఖ్యలు

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్​ జగన్​ సంచలన వ్యాఖ్యలు చేశారు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jagan Cockroach Remarks | వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్​ జగన్​ (Former CM Y.S. Jagan) సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం జెన్​ జీలో ఉన్నామని, జెన్​ అల్ఫా కూడా వచ్చేసిందన్నారు. త‌ప్పు చేసినాక ఒప్పుకోకుండా ఇబ్బందులు పెట్టే కార్య‌క్ర‌మాలు చేస్తే కాక్రోచ్‌లు లేస్తాయని సీఎం చంద్రబాబును హెచ్చరించారు. ఏపీలో తమను కూడా కాక్రోచ్​ అనుకోమన్నారు.

జగన్​ గురువారం మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు (CM Chandrababu) పాలనంతా దగా, మోసం, అబద్ధాలు, స్కాములే అని ఆరోపించారు. డీఎస్సీలో ఎన్నో అక్రమాలు జరిగాయన్నారు. 16 వేల పోస్టులకే ఇన్ని స్కాములు, లీకులు కనిపిస్తున్నాయని మండిపడ్డారు. తమ హయాంలో ఓకే నోటిఫికేషన్‌తో లక్షా 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు.

Jagan Cockroach Remarks | ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగులతో..

Jagan Cockroach Remarks

డీఎస్సీ ప్రశ్నాపత్రాల తయారీ, పరీక్షల నిర్వహణను SCERTకే అప్పగించారని జగన్​ అన్నారు. రహస్యంగా జరగాల్సిన ప్రశ్నాపత్రం తయారీ, అప్‌లోడ్ చేసే పనిని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో చేయించారని ఆరోపించారు. తప్పు బయటపడితే నెపం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై నెట్టొచ్చనే ఇలా చేశారన్నారు. మెరిట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు.

Jagan Cockroach Remarks | ఉద్యోగాలు అమ్ముకున్నారు

కూటమి ప్రభుత్వంలో స్పోర్ట్స్ కోటాలో ఒక్క టీచర్ ఉద్యోగం రూ.15 లక్షలకు అమ్ముకుంటున్నారని జగన్​ ఆరోపించారు. ఏపీ ప్రభుత్వ లోగో డీపీగా పెట్టుకుని ఓ వ్యక్తి బేరాలు ఆడిన వీడియో కూడా బయటికి వచ్చిందని చెప్పారు. అతని మీద నామమాత్రంగా కేసు పెట్టి, స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారన్నారు.

ఇది కూడా చదవండి..: Andhra Liquor Scam | తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ దాడులు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *