Uppal Skywalk Lift | ఉప్పల్ స్కైవాక్ లిఫ్టులో చిక్కుకున్న యువకుడు

ఉప్పల్ స్కైవాక్‌లో లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోవడంతో రాహుల్ అనే యువకుడు చిక్కుకుపోయాడు. రెండు గంటల పాటు శ్రమించి అతడిని అధికారులు బయటకు తీసుకొచ్చారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Uppal Skywalk Lift | హైదరాబాద్‌ (Hyderabad) లోని ఉప్పల్ స్కైవాక్‌లో గురువారం రాత్రి లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోవడంతో రాహుల్ అనే యువకుడు చిక్కుకుపోయాడు. రెండు గంటల పాటు అందులోనే ఉండిపోవడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

రాహుల్ (20) అనే యువకుడు ఉప్పల్‌లోని శ్రీలక్ష్మి వెంకటేశ్వర బాయ్స్ హాస్టల్‌లో ఉంటూ ఎన్‌ఆర్‌పీలో ఉద్యోగం చేస్తున్నాడు. విధుల అనంతరం హాస్టల్‌కు వెళ్లేందుకు గురువారం రాత్రి 6-బీ స్కైవాక్ లిఫ్ట్ ఎక్కాడు. అయితే కిందకు దిగుతుండగా లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోయింది. దీంతో రాహుల్ లిఫ్ట్‌లోనే చిక్కుకుపోయి భయాందోళనకు గురయ్యాడు.

Uppal Skywalk Lift | రెండు గంటలు శ్రమించి..

Uppal Skywalk Lift

లిఫ్ట్​లో యువకుడు చిక్కుకున్నాడనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. హైడ్రా అధికారులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు 2గంటలకు పైగా శ్రమించి రాత్రి 1:15 గంటల సమయంలో యువకుడిని బయటకు తీసుకొచ్చారు. అయితే లిఫ్ట్​ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న సంస్థ ఆలస్యంగా స్పందించడంతో సహాయక చర్యలు లేట్ అయినట్లు సమాచారం. తాను గుండె జబ్బుతో బాధపడుతున్నానని, స్పందనలో ఆలస్యం కారణంగా ఇబ్బందులు పడ్డానని రాహుల్ తెలిపాడు.

ఇది కూడా చదవండి..: Hyderabad Metro Phase 2 | ప్రధాని మోడీతో సీఎం రేవంత్ కీలక భేటీ!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *