అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Telangana Weather | తెలంగాణ (Telangana)లోని పలు జిల్లాల్లో శుక్రవారం భారీ వర్షం కురుస్తుందని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు. రాత్రి సమయంలో విస్తారంగా వాన పడుతుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని భువనగిరి, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్, వనపర్తి, భద్రాద్రి – కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌లలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. కొన్ని చోట్ల 100 మి.మీ. వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉంది. ఉత్తర, మధ్య తెలంగాణలోని ఇతర జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు పడుతాయి.
Telangana Weather | దంచికొట్టిన వాన

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం పూట వాన దంచికొట్టింది. నల్గొండ, నాగర్ కర్నూల్, సూర్యాపేట, ఖమ్మం, యాదాద్రి, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లా (Jagtial District)ల్లో వర్షం పడింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే అక్కడక్కడ వర్షాలు పడుతున్నా.. ఎండ తీవ్రత మాత్రం తగ్గడం లేదు. ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ఇది కూడా చదవండి..: Hyderabad Metro Phase 2 | ప్రధాని మోడీతో సీఎం రేవంత్ కీలక భేటీ!
