Gym Trainer Harassment | జిమ్ ట్రైనర్ నీచమైన డిమాండ్.. మహిళా పైలట్ ఫిర్యాదుతో అరెస్ట్!

శిక్షణ పేరుతో జిమ్‌కు వచ్చే మహిళా పైలట్‌ను లైంగికంగా వేధిస్తూ, ఆమెను లోబరుచుకోవాలని ప్రయత్నించిన ఓ జిమ్ ట్రైనర్ ఉదంతం సనత్‌నగర్‌లో కలకలం రేపింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Gym Trainer Harassment | శిక్షణ పేరుతో జిమ్‌కు వచ్చే మహిళా పైలట్‌ను లైంగికంగా వేధిస్తూ, ఆమెను లోబరుచుకోవాలని ప్రయత్నించిన ఓ జిమ్ ట్రైనర్ ఉదంతం సనత్‌నగర్‌లో కలకలం రేపింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంతోష్ గౌడ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Gym Trainer Harassment | గర్ల్‌ఫ్రెండ్‌తో పథకం..

సనత్‌నగర్‌లోని ఒక ప్రముఖ ‘కల్ట్’ (Cult) జిమ్‌లో బాధితురాలైన మహిళా పైలట్ మెంబర్‌షిప్ తీసుకున్నారు. ఆ జిమ్‌లో ట్రైనర్‌గా పనిచేస్తున్న సంతోష్ గౌడ్, ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేశాడు. తన గర్ల్‌ఫ్రెండ్ రజినీతో కలిసి పథకం వేసిన సంతోష్, ఆమెను ప్రలోభాలకు గురిచేయాలని ప్రయత్నించాడు.

Gym Trainer Harassment |వేధింపుల పర్వం..

“మా ఇద్దరితో కలిసి ప్రైవేట్‌గా గడపాలి.. నాతో ఒక రాత్రి గడుపుతావా?” అంటూ నిందితుడు సంతోష్ గౌడ్ ఆమెపై తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. అతడి నీచమైన ప్రతిపాదనను బాధితురాలు తీవ్రంగా వ్యతిరేకించింది. అయినప్పటికీ వెనక్కి తగ్గని నిందితుడు, ఆమెను మానసికంగా వేధిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకరమైన మెసేజ్‌లు పంపడం మొదలుపెట్టాడు.

Gym Trainer Harassment | పోలీసుల చర్యలు..

ట్రైనర్ వేధింపులు భరించలేని బాధితురాలు సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడు సంతోష్ గౌడ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ వేధింపులలో అతడికి సహకరించిన గర్ల్‌ఫ్రెండ్ రజినీ పాత్రపై కూడా పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.

ఇది కూడా చదవండి:  Road Accidents Telangana | నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *