అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Urea Supply App | జిల్లాలో యూరియా (Urea) పంపిణీని ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా నిర్వహిస్తున్నామని జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి తెలిపారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు.
Urea Supply App | జిల్లాలో..
ఇప్పటివరకు జిల్లాలో 1,29,824 మంది రైతులు 3,55,795 బస్తాలను కొనుగోలు చేశారని వీరస్వామి తెలిపారు. మండలం యూనిట్‌గా జిల్లాలోని అన్ని మండలాలకు కూడా ఈ సదుపాయవ కల్పించామన్నారు. జిల్లాలో ప్రస్తుతం 23వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. రైతులకు సౌకర్యవంతంగా ఉండేటట్లు శాస్త్రీయంగా పంటలకు నత్రజని అందించే విధంగా ఈ యాప్‌ను రూపొందించినట్లు చెప్పారు. రైతులంతా యాప్ విషయంలో ఏమైనా సమస్యలు తలెత్తినట్లయితే వ్యవసాయ విస్తీర్ణాధికారిని లేదా మండల వ్యవసాయ అధికారిని, సొసైటీలకు సంబంధించినటువంటి అధికారులను, వలంటీర్లను సంప్రదించాలని సూచించారు. జిల్లాలో యూరియా పుష్కలంగా ఉందని.. ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. పంటలకు సరిపోయే యూరియాను అందించే బాధ్యత వ్యవసాయ శాఖ తీసుకుంటుందన్నారు.

ఇది కూడా చదవండి..: Journalism Values | జర్నలిజం విలువలు కాపాడాలి: ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి