అక్షరటుడే వెబ్‌డెస్క్: Telangana Rain Alert | తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దక్షిణ తెలంగాణలో ( Telangana )ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ముఖ్యంగా హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది.
Telangana Rain Alert | హైదరాబాద్‌లో భారీ వర్ష సూచన..
శనివారం సాయంత్రం హైదరాబాద్ నగరంపై వాతావరణం దట్టంగా మారింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. ముఖ్యంగా శేరిలింగంపల్లి ప్రాంతంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే మొయినాబాద్, శంకరపల్లి, కొల్లూరు, నల్లగండ్ల, పటాన్చెరు, బీహెచ్ఈఎల్, అమీన్పూర్, కోకాపేట్ వంటి ప్రాంతాల్లో వర్షం మొదలైంది. గంటకు 60 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Telangana Rain Alert | ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్స్ ..
రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల ప్రకారం, వివిధ జిల్లాల్లో భారీ వర్షాల ముప్పు పొంచి ఉంది. ముఖ్యంగా సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలకు అత్యంత భారీ వర్ష సూచన ఉన్నందున ‘రెడ్ అలర్ట్’ ప్రకటించారు. వీటితో పాటు ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, , నల్గొండ జిల్లాల్లో పరిస్థితిని గమనిస్తూ ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేయగా, సిద్ధిపేట, జగిత్యాల, వరంగల్ రూరల్, , భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ‘ఎల్లో అలర్ట్’ ఇచ్చారు.
Telangana Rain Alert | ప్రజలకు సూచనలు..
రాబోయే రెండు రోజుల పాటు (రేపు, ఎల్లుండి) కూడా వర్షాల ప్రభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షం పడుతున్న సమయంలో బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా ఈదురుగాలులు వీస్తున్నప్పుడు చెట్ల కింద లేదా కరెంటు స్తంభాల దగ్గర నిలబడవద్దని అధికారులు హెచ్చరించారు. రైతులు కూడా తమ పంటల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇది కూడా చదవండి: Padmashali Committee Elections | కొండా లక్ష్మణ్ బాపూజీ పద్మశాలి అభివృద్ధి కమిటీ కార్యవర్గం ఎన్నిక