KA Paul Allegations | కూట‌మి నేత‌ల‌పై కేఏ పాల్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KA Paul Allegations | ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఏపీ కూటమి నేతలపై సంచలన ఆరోపణలు చేశారు. తాను ప్రపంచ శాంతి కోసం పోరాడుతుంటే.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్‌ తన చారిటీ ఆస్తులను దోచుకోవడానికి పోరాటం చేస్తున్నారని పాల్ ఆరోపించారు.

KA Paul Allegations | పోరాటం ఆపను

తన ఆస్తులను దోచుకునేందుకు కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. తనపై జరుగుతున్న పరిణామాల వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ప్రజలు నిజాలు గుర్తించాలని కేఏ పాల్ కోరారు.  ప్రశ్నించకుండా తన నోరు మూయించాలని చూస్తున్నారని విమర్శించారు. తాను పోరాటం ఆపనని స్పష్టం చేశారు. తనకు న్యాయం చేయాలని ప్రధాని మోదీ, సుప్రీంకోర్టును కోరారు.

 

దీనిని కూడా చదవండి : Missing Girl Jaanu | కుక్కకు జీపీఎస్ ట్రాకర్ పెట్టినా.. దొరకని జాను ఆచూకీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *