అక్షరటుడే, మెదక్ : Medak Tree Removal Dispute | మెదక్ (Medak) జిల్లా హవేళి ఘన్పూర్ మండలంలో విద్యుత్ శాఖ సిబ్బంది, ఫారెస్ట్ సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అనుమతి లేకుండా విద్యుత్ సిబ్బంది అటవీ భూముల్లో చెట్లను తొలగించడంతో వివాదం మొదలైంది.

హవేళి ఘన్పూర్ మండలంలోని సర్దన కమాన్ నుంచి బూర్గుపల్లి (Burgupalli) గేటు వరకు విద్యుత్ శాఖ అధికారులు శనివారం చెట్ల తొలగింపు పనులు చేపట్టారు. విద్యుత్ తీగల కింద ఉన్న చెట్లను జేసీబీ సాయంతో తొలగించారు. అయితే సమాచారం అందుకున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సాయికృష్ణ, మరో సిబ్బందితో కలిసి అక్కడకు చేరుకున్నారు. అనుమతి లేకుండా చెట్లు తొలగించడం సరికాదని వారితో చెప్పారు. విద్యుత్ వైర్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని, పూర్తిగా చెట్లు తొలగించడం సరికాదన్నారు. ఈ క్రమంలో వాగ్వాదం చోటు చేసుకుంది.
Medak Tree Removal Dispute | దాడికి యత్నం
ఈ విషయమై బీట్ ఆఫీసర్ సాయికృష్ణను విరవణ కోరగా.. అడవిలో చెట్లు తొలగిస్తున్నారనే సమాచారం రావడంతో తాము వెళ్లి అడ్డుకున్నామని తెలిపారు. అప్పటికే 15 చెట్లను జేసీబీతో తొలగించారన్నారు. అధిక సంఖ్యలో ఉన్న విద్యుత్ సిబ్బంది తమను బెదిరించారని ఆరోపించారు. ఫారెస్ట్ కార్యాలయంతో పాటు తన ఇంటికి విద్యుత్ కనెక్షన్ కట్ చేస్తామని బెదిరించారన్నారు. అంతేగాకుండా లైన్‌మన్ రాజునాయక్ తనను అసభ్య పదజాలంతో దూషించారన్నారు. ఆయనకు ఏఈ నవీన్‌కుమార్ సైతం మద్దతు తెలిపారని చెప్పారు. దీంతో తాను వారితో వాగ్వాదం చేశానని తెలిపారు. వారు ఎక్కువ మంది ఉండి తనపై దాడికి యత్నించారని ఆరోపించారు.
Medak Tree Removal Dispute | పోలీసులకు ఫిర్యాదు
ఈ ఘటన అనంతరం ఇరు శాఖల సిబ్బంది ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. అయితే పోలీస్ స్టేషన్ బయట మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యుత్ శాఖలో ఆపరేటర్ ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి ఫారెస్ట్ అధికారులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడినట్లు తెలుస్తోంది. ఏడీఈ మోహన్ బాబు, కంప్యూటర్ ఆపరేటర్ ప్రతాప్ రెడ్డి పోలీసుల ముందే తమను బెదిరించారని ఫారెస్ట్ సిబ్బంది చెప్పారు. ఇష్టం వచ్చినట్లు తిట్టారన్నారు. గతంలో సైతం బీట్ ఆఫీసర్ హరి నాయక్‌పై ఇలాగే దౌర్జన్యం చేశారని ఫారెస్ట్ అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు.
Medak Tree Removal Dispute | మా బాధ్యత
తాము చెట్ల తొలగింపును అడ్డుకున్నందుకు.. విద్యుత్ రాకుండా చేస్తున్నారని గ్రామస్తులను విద్యుత్ శాఖ సిబ్బంది రెచ్చగొడుతున్నారని ఫారెస్ట్ అధికారులు ఆరోపించారు. తాము పనులను అడ్డుకోవడం లేదని, అడవిని కాపాడటం తమ బాధ్యత అన్నారు. నిబంధనల మేరకు పనులు చేపట్టాలని కోరారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పనులను అడ్డుకున్న ఫారెస్ట్ అధికారులపై దౌర్జన్యం చేయడం సరికాదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఏదైనా ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని, కానీ ఇలా బెదిరింపులకు దిగడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నారు.
మెదక్ జిల్లా హవేళీఘన్‌పూర్‌లో విద్యుత్ శాఖ, అటవీ శాఖ సిబ్బంది మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. రోడ్డు పక్కన చెట్ల కొమ్మల తొలగింపు విషయంలో మొదలైన గొడవ, మాట మాట పెరిగి రోడ్డుపై కొట్టుకునే వరకు వెళ్లింది.
Clash Between Electricity and Forest Department Staff in Medak
A serious clash… pic.twitter.com/rCZ6hegXwY
— Akshara Today | Telugu News (@aksharatoday) June 13, 2026
దీనిని కూడా చదవండి : Hyderabad Heavy Rains | వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి.. అధికారులకు సీఎం ఆదేశం