Bhatti Vikramarka Comments | హరీష్‌రావు అబద్ధాలరావుగా మారిపోయారు : డిప్యూటీ సీఎం భట్టి

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bhatti Vikramarka Comments | మాజీ మంత్రి హరీష్‌రావు (Harish Rao) అబద్ధాలరావుగా మారిపోయారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. సింగరేణి (Singareni)లో 335 మంది కార్మికుల వారసులకు కారుణ్య నియామక పత్రాలను శనివారం ఆయన అందజేశారు.

డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ (BRS) నేతలు సింగరేణి వనరులను దోచుకున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం సింగరేణిని కాపాడుతుందని చెప్పారు. కార్మిక కుటుంబాల్లో వెలుగు నింపడమే తమ ప్రభుత్వం లక్ష్యమన్నారు. హరీష్‌రావు, కిషన్‌రెడ్డి (Kishan Reddy) లేఖలపై అనుమానాలున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరి మధ్య రాజకీయ అవగాహన ఉందని ఆరోపించారు. బీఆర్​ఎస్​ పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని విమర్శించారు. ఇంకా కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. సింగరేణిపై ఎలాంటి గద్దలను వాలనివ్వం అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.

Bhatti Vikramarka Comments | ఆలయ అభివృద్ధికి..

gudemgattu

మంచిర్యాల నియోజకవర్గంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గూడెంగుట్ట సత్యనారాయణ స్వామి దేవాలయ అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులతో కలిసి భూమి పూజ చేశారు. దాదాపు రూ.70 కోట్ల వ్యయంతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల అభివృద్ధికి ఇప్పటికే రూ.2,216 కోట్లు కేటాయించగా, రాబోయే గోదావరి పుష్కరాల నిర్వహణకు రూ.1,000 కోట్లు, బాసర నుంచి భద్రాచలం వరకు ఆధ్యాత్మిక కారిడార్ అభివృద్ధికి రూ.802 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు.

దీనిని కూడా చదవండి : Medak Tree Removal Dispute | విద్యుత్​ వర్సెస్​ ఫారెస్ట్ అధికారులు.. చెట్ల తొలగింపు అడ్డుకోవడంతో ఉద్రిక్తత

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *