అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Anganwadi Reappointment | స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అంగన్వాడీ సిబ్బందికి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. మంత్రి సీతక్క (Minister Seethakka) చొరవతో అర్హులైన వారికి తిరిగి విధుల్లోకి తీసుకోవడానికి ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి అనితా రామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలో కొన్ని నెలల క్రితం పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే అక్కడ పోటీ చేయాలని భావించిన పలువురు నాయకులు రిజర్వేషన్ మహిళలకు రావడంతో తమ భార్య, కుటుంబ సభ్యులను బరిలోకి నిలిపారు. ఈ క్రమంలో పలువురు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు సైతం ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. దీంతో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేశారు.
Anganwadi Reappointment | పునర్నియామకానికి గ్రీన్ సిగ్నల్

ఎన్నికల్లో పోటీ చేసిన పలువురు అంగన్వాడీ సిబ్బంది ఓడిపోయారు. దీంతో వారికి మరోసారి ఉద్యోగం కల్పిండానికి ప్రభుత్వం ఓకే చెప్పింది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజీనామా చేసి అనంతరం ఎన్నికల్లో ఓడిపోయిన అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పునర్నియామక ప్రక్రియకు పచ్చా జెండా ఊపింది. మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చొరవతో ఈ అంశాన్ని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించింది.
Anganwadi Reappointment | ఆ సందర్భాల్లో మాత్రమే..
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) పోటీ చేసేందుకు రాజీనామా చేసి, ఎన్నికల్లో విజయం సాధించని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల అప్పీల్స్‌ను పరిశీలించనున్నారు. అయితే వారి స్థానంలో ఇప్పటికే మరో అభ్యర్థిని నియమించని సందర్భాల్లో మాత్రమే పునర్నియామకానికి అవకాశం కల్పించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అనేక మంది అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు ఊరట లభించనుంది.
దీనిని కూడా చదవండి : Dhiraj Seth Army Chief | భారత ఆర్మీ కొత్త చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ నియామకం