Ponnam on SIR | అర్హుల ఓటు హక్కు తొలగించకుండా చూడాలి : మంత్రి పొన్నం

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ponnam on SIR | కరీంనగర్ (Karimnagar) పార్లమెంట్ కాంగ్రెస్ నేతలతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Goud), ఏఐసీసీ ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్ గారితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్​ జూమ్​ మీటింగ్​ నిర్వహించారు. ఇప్పటికే హుస్నాబాద్ నియోజకవర్గంలో SIR ఓటరు సవరణ ప్రక్రియ పై BLAలకు శిక్షణ ఇచ్చామని తెలిపారు.

బూత్ లెవెల్ ఏజెంట్లు వారి బూత్​లో అర్హత ఉన్న ఒక ఓటు కూడా పోకుండా జాగ్రత్తగా ఉండేలా చర్యలు తీసుకోవాలని వారు సూచించారు. ప్రతి బూత్‌లో ఓటరు జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా చూడాలన్నారు. 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కొత్త ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. చిరునామా మార్పు, పేరు సవరణ, ఫొటో మార్పు వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. బూత్ లెవెల్ ఏజెంట్లు (BLAలు) తమ పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించి ఓటరు జాబితాలను ధ్రువీకరించుకోవాలన్నారు.

Ponnam on SIR | అభ్యంతరాలు సమర్పించాలి

ఎన్నికల సంఘం విడుదల చేసే ప్రతి డ్రాఫ్ట్ జాబితాను పరిశీలించి అవసరమైన అభ్యంతరాలు, సవరణలు సకాలంలో సమర్పించాలని కాంగ్రెస్​ నాయకులకు మంత్రి పొన్నం సూచించారు. గ్రామ, వార్డు, మండల స్థాయిలో పార్టీ నాయకులు సమన్వయంతో పని చేయాలన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతానికి SIR ప్రక్రియను ఒక అవకాశంగా ఉపయోగించుకోవాలి అని దిశా నిర్దేశం చేశారు.

దీనిని కూడా చదవండి : Heavy Rain Alert | నేడు భారీ వర్ష సూచన

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *