అక్షరటుడే వెడ్‌డెస్క్: Software Engineer Death | యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఫామ్‌హౌస్‌లో గెట్-టు-గెదర్ పార్టీ చేసుకుంటున్న సమయంలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
Software Engineer Death | ఘటన వివరాలు..
మంచిర్యాల జిల్లాకు చెందిన గుండ్ల మధు (27) హైదరాబాద్‌లోని NSL కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. వీకెండ్ కావడంతో, తన ఆఫీసులోని మరో 14 మంది సహోద్యోగులతో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా, కొయ్యలగూడెం గ్రామ సమీపంలోని ఓ ఫామ్‌హౌస్‌కు పార్టీ కోసం వెళ్ళాడు. నిన్న (జూన్ 13 ) రాత్రి జరిగిన ఈ పార్టీలో అందరూ కలిసి గడుపుతుండగా, అనుకోకుండా మధు మృతి చెందడంతో అక్కడ విషాదం అలుముకుంది. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Software Engineer Death | పోలీసుల దర్యాప్తు..
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పార్టీలో పాల్గొన్న మిగతా ఉద్యోగులను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వస్తేనే మృతికి గల అసలు కారణాలు తెలుస్తాయని అధికారులు వెల్లడించారు.
ఫామ్‌హౌస్‌లో గెట్ టూ గెదర్ పార్టీ
సాప్ట్వేర్ ఇంజినీర్ అనుమానాస్పద మృతి
యాదాద్రి భువనగిరి జిల్లా కొయ్యలగూడెం గ్రామ సమీపంలో ఘటన
మృతుడు మంచిర్యాల జిల్లాకు చెందిన గుండ్ల మధు (27) గా గుర్తింపు.
వీకెండ్ కావడంతో నిన్న ఫామ్‌హౌస్‌లో పార్టీ చేసుకున్న..
హైదరాబాద్ NSL… pic.twitter.com/cZp9YkGYnL
— PulseNewsBreaking (@pulsenewsbreak) June 14, 2026
ఇది కూడా చదవండి: Nandipadu Child Assault | తొమ్మిదేళ్ల బాలికపై లైంగిక దాడి.. నిందితుడు అరెస్ట్