అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Police Mentors Program | హైదరాబాద్ (Hyderabad) నగరంలో భద్రతను మరింత బలోపేతం చేసేందుకు సిటీ పోలీస్ సరికొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. ‘మార్గదర్శక్’ కార్యక్రమానికి అనుబంధంగా కొత్తగా ‘పోలీస్ మెంటర్స్ ప్రోగ్రామ్’ను తీసుకువస్తున్నట్లు సీపీ సజ్జనార్ (CP Sajjanar) తెలిపారు.
ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కానిస్టేబుల్‌ను మెంటర్‌గా నియమిస్తామని, వారు క్షేత్రస్థాయిలో మార్గదర్శక్ వలంటీర్లతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ పనిచేస్తారని సీపీ తెలిపారు. బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీ ఆడిటోరియంలో హెచ్‌సీఎస్‌సీ ఆధ్వర్యంలో జరిగిన మార్గదర్శక్ శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. శిక్షణ పూర్తి చేసుకున్న 80 మంది వలంటీర్లకు సర్టిఫికెట్లను అందించారు.
Police Mentors Program | కీలక పాత్ర
నగరంలో ప్రజా భద్రత, మహిళా భద్రత, అత్యవసర సేవలలో భాగస్వాములుగా ఉంటూ, ప్రజలను చైతన్యవంతమైన వలంటీర్లుగా తీర్చిదిద్దడమే మార్గదర్శక్ ముఖ్య ఉద్దేశమని సజ్జనార్ తెలిపారు. వలంటీర్లకు ప్రజా భద్రత, ఎమర్జెన్సీ రెస్పాన్స్, మహిళల భద్రత, సైబర్ క్రైం వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ అందించామన్నారు. వీరు సేఫ్టీ అంబాసిడర్స్‌గా నగర భద్రతలో కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రిటైర్డ్ అధికారులు, విద్యావేత్తలు, నిపుణుల సేవలను కూడా ఈ వ్యవస్థలో భాగస్వామ్యం చేస్తామని వెల్లడించారు.
దీనిని కూడా చదవండి : Penthouse Shed Collapse | పెంట్ హౌజ్‌పై నుంచి పడిన రేకులు.. ఒకరికి తీవ్ర గాయాలు