అక్షరటుడే, న్యూఢిల్లీ: Mamata Banerjee | పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యవహారశైలిపై సుప్రీంకోర్టు అత్యంత కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ‘ఐప్యాక్’ (I-PAC)పై జరుగుతున్న మనీలాండరింగ్ విచారణలో ముఖ్యమంత్రి, రాష్ట్ర ఉన్నతాధికారులు నేరుగా జోక్యం చేసుకోవడంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రమాదంలోకి నెట్టేలా ఉన్నాయని ధర్మాసనం హెచ్చరించింది.
Mamata Banerjee | బొగ్గు కుంభకోణం కేసు..
బెంగాల్‌లో సంచలనం సృష్టించిన బొగ్గు కుంభకోణం కేసులో భాగంగా ఈడీ (ED) దర్యాప్తు చేపడుతోంది. ఈ క్రమంలో ఐప్యాక్ సహ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తుండగా, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా తన అధికారులతో కలిసి అక్కడికి వెళ్లి దర్యాప్తును అడ్డుకున్నారని ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2021 నుంచి టీఎంసీ పార్టీకి ఐప్యాక్ సేవలందిస్తున్న విషయం తెలిసిందే.

Mamata Banerjee | సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు, మమతా బెనర్జీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసింది.
రాజ్యాంగ విరుద్ధం: ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి దర్యాప్తు సంస్థల పనిలో నేరుగా జోక్యం చేసుకుంటారని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఎప్పుడూ ఊహించి ఉండరని కోర్టు వ్యాఖ్యానించింది. ఇది కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య ఉన్న రాజకీయం కాదు. ఓ ముఖ్యమంత్రి దర్యాప్తులో నేరుగా తలదూర్చడం ఏమాత్రం సమర్థనీయం కాదు” అని కోర్టు స్పష్టం చేసింది.
ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం: విచారణను ప్రభావితం చేసేలా వ్యవహరించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది. ఈడీ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ, సోదాల సమయంలో ముఖ్యమంత్రి జోక్యం వల్ల అధికారుల విధులకు ఆటంకం కలిగిందని కోర్టుకు వివరించారు.
ఇది కూడా చదవండి..: Pahalgam Terror Attack | పహల్గాం నెత్తుటి జ్ఞాపకానికి ఏడాది.. ఉగ్రదాడి స్థలంలో ధైర్యంగా నివాళులర్పించిన 15 ఏళ్ల బాలిక

