అక్షరటుడే, వెబ్‌డెస్క్: India Women Victory | ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో India Women’s Cricket Team పాకిస్తాన్‌పై అద్భుత విజయం సాధించింది. 171 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో Pakistan Women’s Cricket Team 106 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్ 64 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది.
India Women Victory | దీప్తీ శర్మ అద్భుత ప్రదర్శన
భారత బౌలింగ్ విభాగంలో దీప్తీ శర్మ అద్భుత ప్రదర్శనతో 5 వికెట్లు తీసి పాకిస్తాన్ బ్యాటింగ్‌ను కుప్పకూల్చారు. అలాగే శ్రీచరణి 3 వికెట్లు సాధించి జట్టు విజయానికి కీలక పాత్ర పోషించారు.
ఈ విజయంతో భారత్ వరల్డ్ కప్‌లో విజయ శుభారంభం చేసింది. తదుపరి మ్యాచ్‌లో భారత్ ఈ నెల 17న నెదర్లాండ్స్‌తో తలపడనుంది.