అక్షరటుడే వెబ్డెస్క్: Pawan Kalyan Sena Prasthanam | దేశ రాజధానిలో ‘సేన ప్రస్థానం – దేశ సమగ్రత కోసం సేనా ప్రస్థానం’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ( Pawan Kalyan )పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ సిద్ధాంతాలను, గత రాజకీయ పరిస్థితులను గుర్తు చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Pawan Kalyan Sena Prasthanam | ప్రసంగంలోని అంశాలు..
దేశ సమగ్రతను కాపాడటమే జనసేన ప్రధాన సిద్ధాంతమని, దేశ స్ఫూర్తిని దేశవ్యాప్తంగా తీసుకెళ్లడమే తమ లక్ష్యమని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అందుకే పార్టీ కార్యక్రమాన్ని ఢిల్లీ వేదికగా నిర్వహించినట్లు తెలిపారు. తెలంగాణ ఏర్పాటును జనసేన ఎప్పుడూ వ్యతిరేకించలేదని, అయితే రాష్ట్ర విభజన జరిగిన తీరును మాత్రమే తాము తప్పుబట్టామని ఆయన వివరించారు.

Pawan Kalyan Sena Prasthanam | కాంగ్రెస్ తీరుపై విమర్శలు..
ఢిల్లీలో తమ పార్టీ సమావేశాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారని, తమపై తీవ్ర విమర్శలు చేశారని పవన్ అసహనం వ్యక్తం చేశారు. గతంలో ఎలా వ్యవహరించారో, నేటికీ కాంగ్రెస్ పార్టీ తీరు మారలేదని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు, నేతలకు పవన్ కల్యాణ్ ‘సేన ప్రస్థానం’ ఆశయాలను, భవిష్యత్తు కార్యాచరణను వివరించారు.
ఇది కూడా చదవండి: Vahan Sarathi Down | నిలిచిన వాహన సారథి సేవలు..