Heavy Rain Alert | 19 నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్​.. అప్రమత్తంగా ఉండాలి : మంత్రి పొంగులేటి

రాష్ట్రంలో ఈ నెల 19 నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Rain Alert | రాష్ట్రంలో ఈ నెల 19 నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti) అన్నారు.

వర్షాకాలం నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు ఎదురుకాకుండా ముందస్తుగానే అన్ని అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన తర్వాత స్పందించడం కంటే, వాటి ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి నివారణ చర్యలు తీసుకోవడం కీలకమన్నారు. రెవెన్యూ, విపత్తుల నిర్వహణ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉంచాలని మంత్రి సూచించారు.

Heavy Rain Alert | విస్తరించనున్న రుతుపవనాలు

నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) రాబోయే 3 నుంచి 4 రోజుల్లో తెలంగాణ అంతటా విస్తరించే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ఈ నెల 19వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తాయని, అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్రంలో జూన్ 1 నుంచి ఇప్పటివరకు 49.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవగా, సాధారణ వర్షపాతం 54.9 మిల్లీమీటర్లతో పోలిస్తే సుమారు 10 శాతం లోటు ఉందని తెలిపారు.

ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. వర్షాకాలం ముగిసే వరకు అన్ని జిల్లాల అధికారులు నిరంతర అప్రమత్తతతో పనిచేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

దీనిని కూడా చదవండి : Hyderabad Metro Phase 2 | కేటీఆర్ మాట వినే కిషన్ రెడ్డి మెట్రో ఫేజ్-2ను అడ్డుకుంటున్నారు: రేవంత్ రెడ్డి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *