ACB Raids Narahari | ల్యాండ్, సర్వే డిపార్ట్‌మెంట్ డిప్యూటీ డైరెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు

ల్యాండ్ అండ్ సర్వే డిపార్ట్‌మెంట్ డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి ఇంట్లో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. హైదరాబాద్​లోని ఆయన నివాసాలతో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతన్నాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: ACB Raids Narahari | ల్యాండ్ అండ్ సర్వే డిపార్ట్‌మెంట్ డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి ఇంట్లో ఏసీబీ సోదాలు (ACB Raids) కలకలం రేపాయి. హైదరాబాద్​ (Hyderabad)లోని ఆయన నివాసాలతో పాటు బంధువులు, మిత్రుల ఇళ్లలో సోదాలు కొనసాగుతన్నాయి.

ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ ఆధ్వర్యంలో నారాయణగూడతో పాటు 12 చోట్ల ఏకకాలంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే పక్కా సమాచారంతో మంగళవారం ఉదయం నుంచి తనిఖీలు చేపట్టారు. నగరంలోని నరహరి నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన ఆఫీసులు, బంధువులు, అత్యంత ఆప్తుల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి.

ACB Raids Narahari | అవినీతి ఆరోపణలు

ACB Raids Narahari

నరహరి తన అధికారిక ఆదాయానికి మించి భారీగా అక్రమ ఆస్తులను కూడబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. దీంతో అధికారులు మంగళవారం ఉదయం సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కీలకమైన భూమి పత్రాలు, బ్యాంక్ ఖాతాల వివరాలు, నగదు, బంగారు ఆభరణాలకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. సోదాలు ముగిసిన తర్వాత అధికారులు అక్రమాస్తుల వివరాలను వెల్లడించనున్నారు.

ఇది కూడా చదవండి..: Casting Artist Harassment | సినీ అవకాశాల పేరుతో లైంగిక వేధింపులు.. క్యాస్టింగ్ ఆర్టిస్ట్‌పై నటి ఫిర్యాదు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *