అక్షరటుడే, వెబ్డెస్క్: NDA Rajya Sabha Strength | రాజ్యసభలో ఎన్డీఏ బలం పెరిగింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ, ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధించడంతో రాజ్యసభలో NDA బలం 163కు చేరింది.
రాజ్యాంగ సవరణ బిల్లుల కోసం లోక్సభ (Lok Sabha), రాజ్యసభలో 2/3 మెజారిటీ అసవరం. ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి రెండు సభల్లోనూ అంత మెజారిటీ లేదు. దీంతో ఇటీవల డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు వీగిపోయాయి. అయితే ప్రస్తుతం రాజ్యసభలో ఎన్డీఏ బలం పెరిగింది. 2/3 మెజారిటీకి అవసరమైన సంఖ్య 172 కాగా ఎన్డీఏకు ప్రస్తుతం 163 మంది ఎంపీలున్నారు. 2/3 మెజారిటీ కేవలం 9 స్థానాల దూరంలోనే ఉంది.
NDA Rajya Sabha Strength | తొలగనున్న అడ్డంకులు
TMC, AAP పరిణామాలు NDAకి మరింత కలిసొస్తే.. డీలిమిటేషన్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ వంటి కీలక బిల్లులకు రాజ్యసభలో అడ్డంకులు మరింత తగ్గవచ్చు. అయితే లోక్సభలో పరిస్థితి భిన్నంగా ఉంది. 2/3 మెజారిటీకి 363 స్థానాలు అవసరం కాగా NDA వద్ద ప్రస్తుతం 314 స్థానాలే ఉన్నాయి. మరోవైపు ఇండీ కూటమిలోని కీలక శక్తులైన TMC, AAP, DMKలు రాజకీయంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే డీఎంకే ఇండియా కూటమికి దూరంగా ఉంటుంది. టీఎంసీలో సైతం చీలిక వచ్చింది. దీంతో లోక్సభలో సైతం ఆ పార్టీ ఆధిక్యం సాధించే అవకాశం ఉంది. అదే జరిగితే బీజేపీ ప్రభుత్వం (BJP Government) కీలక బిల్లులను మరోసారి పార్లమెంట్లో ప్రవేశ పెట్టనుంది.
ఇది కూడా చదవండి..: ACB Raids Narahari | ల్యాండ్, సర్వే డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు