అక్షరటుడే, వెబ్‌డెస్క్: Monsoon Preparedness | వర్షాకాలం నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand) ఆదేశించారు. హైదరాబాద్ నగరంలోని మల్కం చెరువు, కొండాపూర్ నాలా వద్ద హైడ్రా, జీహెచ్ఎంసీ, పోలీసు అధికారులతో ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు.
భారీ వర్షాలు, నీరు నిలిచిపోవడం వల్ల ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు పోలీస్ శాఖ అత్యున్నత స్థాయి సన్నద్ధతతో ఉందని డీజీపీ స్పష్టం చేశారు. ట్రాఫిక్ రద్దీని నివారించడానికి, వాహనాల రాకపోకలు సజావుగా సాగేలా చూసేందుకు, సమస్యలు తలెత్తే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందుస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే, ప్రత్యామ్నాయ ట్రాఫిక్ మార్గాలను గుర్తించడం, అవసరమైనప్పుడు ప్రజలకు సకాలంలో సమాచారాన్ని అందించాలన్నారు.
Monsoon Preparedness | నిఘా ఉంచాలి

నగరంలోని లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ఉన్న ప్రాంతాలు, ప్రధాన ట్రాఫిక్ జంక్షన్లలో నిరంతరం నిఘా ఉంచాలని డీజీపీ పోలీసు సిబ్బందిని ఆదేశించారు. నీటిపారుదల శాఖ ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డీజీపీతో పాటు జీహెచ్ఎంసీ కమిషనఱ్ ఆర్వీ కర్ణన్, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన, హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydraa Commissioner Ranganath), సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డిల పాల్గొన్నారు.
Monsoon Preparedness | ప్రత్యేక బృందాల ఏర్పాటు
మల్కం చెరువు, ఖాజాగూడ చెరువు, మండికుంట, గురునాథ్ చెరువు, మియాపూర్ ప్రాంతంలోని చెరువులు, బయోడైవర్సిటీ జంక్షన్ పరిసర ప్రాంతాలు, కొండాపూర్ మరియు ఇతర వరద ముప్పు ఉన్న ప్రాంతాలలో క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టేందుకు ప్రత్యేక ఇంజనీరింగ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. నీటి ప్రవాహ మార్గాలు, ఆక్రమణలు, డ్రైనేజీ అనుసంధానం, నీరు నిలిచిపోవడానికి కారణమయ్యే ఇతర అంశాలపై ఈ బృందాలు సమగ్ర పరిశీలన చేస్తాయని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..: Gurukul Tender Scam | గురుకుల టెండర్లలో స్కామ్ : హరీశ్‌రావు