GHR Callisto Handover | హైదరాబాద్‌లో మరో మెగా ప్రాజెక్ట్ సిద్ధం.. ‘జీహెచ్ఆర్ కాలిస్టో’లో ఇళ్ల అప్పగింతలు ప్రారంభం

పశ్చిమ హైదరాబాద్‌లోని కొల్లూర్‌లో జీహెచ్ఆర్ ఇన్‌ఫ్రా నిర్మించిన ప్రతిష్టాత్మక స్మార్ట్, సస్టైనబుల్ గేటెడ్ కమ్యూనిటీ 'జీహెచ్ఆర్ కాలిస్టో'లో తొలి విడత ఇళ్ల అప్పగింత ప్రక్రియ సోమవారం ఘనంగా ప్రారంభమైంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: GHR Callisto Handover | పశ్చిమ హైదరాబాద్‌లోని ( Hyderabad ) కొల్లూర్‌లో జీహెచ్ఆర్ ఇన్‌ఫ్రా నిర్మించిన ప్రతిష్టాత్మక స్మార్ట్, సస్టైనబుల్ గేటెడ్ కమ్యూనిటీ ‘జీహెచ్ఆర్ కాలిస్టో’లో తొలి విడత ఇళ్ల అప్పగింత ప్రక్రియ సోమవారం ఘనంగా ప్రారంభమైంది. పశ్చిమ హైదరాబాద్ పరిధిలో ఒక పెద్ద ప్రాజెక్టును నిర్ణీత గడువులోగా డెలివరీ చేయడంలో ఇది కీలక మైలురాయిగా నిలిచింది.

GHR Callisto Handover | ప్రాజెక్ట్ వివరాలు..

8.3 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్ట్‌లో నాలుగు టవర్లు, 11 వింగ్స్ ఉన్నాయి. ఇందులో 2, 2.5, 3 , 4 బీహెచ్‌కే విభాగాలలో మొత్తం 1,190 అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. ఐజీబీసీ (IGBC) ప్రీ-సర్టిఫైడ్ గోల్డ్ రేటింగ్‌ను దక్కించుకున్న ఈ ప్రాజెక్ట్‌లో అపార్ట్‌మెంట్ల పరిమాణం 1,195 చదరపు అడుగుల నుండి ప్రారంభమవుతుంది. సాధారణ మోడళ్ల ధరలు సుమారు రూ. 83 లక్షల నుండి ప్రారంభం కానున్నాయి.

GHR Callisto Handover | అత్యాధునిక వసతులు..

జీహెచ్ఆర్ కాలిస్టో ప్రాజెక్ట్ నివాసితుల కోసం దాదాపు 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యంత ఆధునిక వసతులతో కూడిన భారీ క్లబ్‌హౌస్‌ను నిర్మించారు. వినోదం, క్రీడల కోసం ఇందులో మల్టిపుల్ స్విమ్మింగ్ పూల్స్, అత్యాధునిక జిమ్నాసియం, ఇండోర్ గేమ్స్, మినీ గోల్ఫ్, క్రికెట్ ప్రాక్టీస్ ఫెసిలిటీస్, బాస్కెట్‌బాల్ కోర్ట్ వంటి సదుపాయాలతో పాటు పార్టీ లాన్స్, బార్బెక్యూ స్పేస్‌లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వీటితో పాటు పిల్లల కోసం ఆట స్థలాలు, పెట్ పార్క్, ప్రశాంతమైన లైబ్రరీ వంటి సౌకర్యాలను కల్పించడమే కాకుండా, ప్రాజెక్ట్ మొత్తం విస్తీర్ణంలో దాదాపు 70 శాతం వరకు ఓపెన్ స్పేస్‌ను వదిలి పచ్చని వాతావరణాన్ని అందించారు. అంతేకాకుండా, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్ట్‌లో స్మార్ట్ హోమ్ ఆటోమేషన్, ఈవీ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు, వర్షపు నీటి నిల్వ (రెయిన్ వాటర్ హార్వెస్టింగ్), సేంద్రీయ వ్యర్థాల కంపోస్టింగ్, గ్రే వాటర్ ట్రీట్‌మెంట్ వంటి అత్యాధునిక పర్యావరణ హిత ఫీచర్లను కూడా పొందుపరిచారు.

ghr 1

GHR Callisto Handover | నాణ్యత & పారదర్శకత..

ఈ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ సేవలను టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌కు చెందిన పూర్తి అనుబంధ సంస్థ ‘టీక్యూసెర్ట్ (TQCert) సర్వీసెస్’ పర్యవేక్షించింది. నిర్మాణంలో ఖచ్చితత్వం కోసం బిమ్ (BIM) సాంకేతికతను వాడారు. టీజీ రెరా (TG RERA) నంబర్ P01100004554 కింద ఈ ప్రాజెక్ట్ నమోదు చేసారు.

GHR Callisto Handover | కొనుగోలుదారుల ఆనందం..

ఇళ్ల అప్పగింత కార్యక్రమంలో జీహెచ్ఆర్ ఇన్‌ఫ్రా సీఈఓ కార్తీష్ రెడ్డి మాడ్గుల, డెసిగ్నేటెడ్ పార్ట్‌నర్ శ్యామ్ సుందర్ రెడ్డి పాల్గొన్నారు. వారు ఎంపిక చేసిన కొనుగోలుదారులకు స్వయంగా హ్యాండోవర్ కిట్లను అందజేశారు. కొనుగోలుదారులు తమ ఇళ్లలోకి మారే ముందు, తమ అభిరుచులకు తగ్గట్టుగా ఇంటీరియర్ ప్లానింగ్, ఫర్నిచర్ మార్పులు చేసుకునే అవకాశం లభించడంపై ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

GHR Callisto Handover | వ్యూహాత్మక లొకేషన్..

ఔటర్ రింగ్ రోడ్ (ORR)కు కనెక్టివిటీ ఉండటం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి వంటి ప్రధాన ఉపాధి కేంద్రాలకు, అలాగే పాఠశాలలు, ఆసుపత్రులు , రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ ప్రాజెక్ట్ చేరువలో ఉండటం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

GHR Callisto Handover | సీఈఓ వ్యాఖ్యలు..

ఈ సందర్భంగా కార్తీష్ రెడ్డి మడుగుల మాట్లాడుతూ.. “ఇచ్చిన మాట ప్రకారం ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి నివాస యోగ్యంగా మార్చడం మాకు ఎంతో కీలకమైన క్షణం. భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడే కమ్యూనిటీలను నిర్మించడంలో మా నిబద్ధతకు జీహెచ్ఆర్ కాలిస్టో ఒక నిదర్శనం” అని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: MP Arvind Comments | పిప్రి మరో బెంగాల్​ అవుతుంది.. ఎంపీ అర్వింద్​ సంచలన వ్యాఖ్యలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *