Women Child Safety | మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యతనివ్వాలి: అదనపు డీసీపీ

మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రత్యేకంగా ప్రాధాన్యత నివ్వాలని అదనపు డీసీపీ (అడ్మిన్) శుభం ప్రకాష్ సూచించారు.

Shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం : Women Child Safety | జిల్లా వ్యాప్తంగా మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రత్యేకంగా ప్రాధాన్యత నివ్వాలని అదనపు డీసీపీ (అడ్మిన్) శుభం ప్రకాష్ సూచించారు. పోలీసు శాఖ (Police Department) ఆధ్వర్యంలో భరోసా సెంటర్, న్యాయశాఖ, చైల్డ్ వెల్ఫేర్, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో కో–ఆర్డినేషన్ కార్యక్రమాన్ని సీపీ కార్యాలయంలో నిర్వహించారు.

Women Child Safety | నిజామాబాద్ జిల్లాలో..

జిల్లాలో మహిళలు చిన్నారుల రక్షణకు సంక్షేమానికి అన్ని శాఖలు సమన్వయంగా కృషి చేయాలని శుభం ప్రకాష్ అన్నారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు బాధితులకు సత్వర న్యాయ సహాయం అందే విధంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బాధితులకు న్యాయ సహాయం, వైద్య సేవలు, కౌన్సెలింగ్, పునరావాస చర్యలు, కేసు విషయంలో సూచనలు ఎప్పటికప్పుడు అందించాలని పేర్కొన్నారు. బాధితులకు ఒకే వేదికపై అన్ని సేవలు అందేలా భరోసా సెంటర్ పర్యవేక్షించాలని కోరారు. బాధితులు మానసికంగా, శారీరకంగా, సామాజికంగా కోలుకునేలా అన్ని శాఖలు పరస్పర సహకారం అందించాలన్నాని వివరించారు.

కార్యక్రమంలో ఏసీపీ ప్రకాష్, స్పెషల్ బ్రాంచ్ ఇన్​స్పెక్టర్​ శ్రీధర్ రెడ్డి, సీసీఆర్బీ సీఐ పాండేరావు, ఎస్సై వర ప్రసాద్ రెడ్డి, ఫోక్సో కోర్టు ఇన్​ఛార్జి పీపీ నరసింహారెడ్డి, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదార్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ శోభారాణి, జిల్లా ప్రొఫెషనల్ ఆఫీసర్ పవన్ కళ్యాణ్, చైల్డ్ లైన్ కో–ఆర్డినేటర్ జోత్స్న, సర్వేలైన్ ఇన్​ఛార్జి డాక్టర్ వెంకటేష్, డీసీపీవో చైతన్య, భరోసా సెంటర్ ఇన్​ఛార్జి మహిళా ఎస్సై పుష్పవతి, భరోసా సెంటర్ ప్రతినిధి రోజా తదితరులు పాల్గొన్నారు.

Women Child Safety

ఇది కూడా చదవండి..: Nutritious Meals | మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *