Telangana Public School | ఆరుట్లలో పబ్లిక్ స్కూల్ ప్రారంభం.. విద్యార్థులతో ఫుట్‌బాల్ ఆడిన సీఎం

రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన 'తెలంగాణ పబ్లిక్ స్కూల్'ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ( జూన్ 17 ) ప్రారంభించారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Telangana Public School | రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy )  బుధవారం ( జూన్ 17 ) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, పాఠశాల వసతులను పరిశీలించడమే కాకుండా, విద్యార్థులతో కలిసి సరదాగా గడిపారు.

Telangana Public School | క్లాస్‌రూమ్‌ల పరిశీలన..

పాఠశాల ప్రాంగణంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా తిరిగి, అక్కడ ఉన్న కిచెన్, ల్యాబ్స్, లైబ్రరీ , డిజిటల్ క్లాస్‌రూమ్‌లను పరిశీలించారు. ఆ తర్వాత విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. విద్యార్థుల ఉత్సాహాన్ని చూసి, వారితో కలిసి కాసేపు ఫుట్‌బాల్ కూడా ఆడారు.
arutla.1

Telangana Public School | “పేదల పిల్లలు ఐఏఎస్‌లు కావాలి”..

ఈ సందర్భంగా పాఠశాలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. “ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ రాష్ట్రంలోని 24 వేల పాఠశాలలకు ఆదర్శంగా నిలవాలి. విద్య ద్వారానే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుంది. మట్టిలో మాణిక్యాల వంటి ప్రతిభావంతులను వెలికితీసేందుకే ప్రభుత్వ పాఠశాలలను పునరుద్ధరిస్తున్నాం. అందుకే ప్రభుత్వం విద్యాశాఖపై ఏకంగా రూ. 27 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. పేదల పిల్లలు కూడా డాక్టర్లు, ఇంజినీర్లు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా ఎదిగి ఉన్నత స్థాయికి చేరుకోవాలి” అని ఆయన ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా తీర్చిదిద్ది, నాణ్యమైన విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Shabbir Ali Flexies | షబ్బీర్​ అలీకి మద్దతుగా గాంధీ భవన్​లో ఫ్లెక్సీలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *