Grok AI Pentagon | యుద్ధంలో ‘గ్రోక్’ ఏఐ సాయం.. 96 గంటల్లో 2,000 టార్గెట్లు ధ్వంసం

అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ తన యుద్ధ తంత్రాల్లో సరికొత్త మార్పులు తీసుకువచ్చింది.

Shivam nagarani

అక్షరటేడే వెబ్‌డెస్క్: Grok AI Pentagon | అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ తన యుద్ధ తంత్రాల్లో సరికొత్త మార్పులు తీసుకువచ్చింది. ఎలాన్ మస్క్‌కు చెందిన ‘ఎక్స్‌ఏఐ’ (xAI) సంస్థ అభివృద్ధి చేసిన ‘గ్రోక్’ (Grok) అనే కృత్రిమ మేధస్సును తాము యుద్ధ ఆపరేషన్లలో సమర్థవంతంగా వాడుతున్నట్లు అమెరికా రక్షణశాఖ అధికారికంగా ప్రకటించింది.

Grok AI Pentagon | 96 గంటల్లో అద్భుతం..

‘ప్రాజెక్ట్ మావెన్’ (Project Maven)లో భాగంగా గ్రోక్ ఏఐని ఉపయోగిస్తున్నామని పెంటగాన్ ఏఐ చీఫ్ కామెరూన్ స్టాన్లీ వెల్లడించారు. తాజాగా ఇరాన్‌తో జరిగిన ఘర్షణల్లో ఈ ఏఐ సాయంతో కేవలం 96 గంటల వ్యవధిలోనే 2,000 లక్ష్యాలను గుర్తించి, వాటిని పూర్తిగా ధ్వంసం చేసినట్లు ఆయన తెలిపారు. గ్రోక్ అందించిన ఖచ్చితమైన డేటా వల్లే ఇది సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు.

grok.1

Grok AI Pentagon | కోర్టులో మస్క్ కంపెనీకి మద్దతు..

ఎలాన్ మస్క్‌కు చెందిన ఎక్స్‌ఏఐ సంస్థపై పర్యావరణపరమైన కారణాలతో ఒక పౌరహక్కుల సంస్థ కోర్టులో దావా వేసింది. దీనిపై విచారణ సందర్భంగా అమెరికా న్యాయశాఖ మస్క్ కంపెనీకి మద్దతుగా నిలిచింది. అమెరికా జాతీయ భద్రతకు ‘గ్రోక్’ ఏఐ వెన్నెముకగా నిలుస్తోందని, అలాంటి సంస్థపై ఆంక్షలు పెట్టడం దేశ భద్రతకే ప్రమాదకరమని న్యాయశాఖ కోర్టులో వాదించింది.

Grok AI Pentagon | ట్రంప్ ప్రభుత్వ కీలక నిర్ణయం..

గతంలో రక్షణశాఖ ‘ఆంథ్రోపిక్ క్లాడ్’ ఏఐతో ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ, నిఘా విషయాల్లో తలెత్తిన విభేదాల కారణంగా ఫిబ్రవరిలో ఆ కాంట్రాక్టును రద్దు చేసుకుంది. ఆ తర్వాతే ఎక్స్‌ఏఐతో జతకట్టింది. అమెరికా ఆర్థిక, ఇంధన భద్రతలో మస్క్ కంపెనీ పాత్ర కీలకంగా మారిందని రక్షణశాఖ భావిస్తోంది.

ఇది కూడా చదవండి: NEET Telegram Ban | టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంస్థ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *