Basara IIIT | బాసర ట్రిపుల్​ ఐటీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం..

బాసర ట్రిపుల్​ ఐటీలో బుధవారం ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. బుధవారం భవనంపై నుంచి దూకింది.

Shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : Basara IIIT | బాసర(Basara) ట్రిపుల్​ ఐటీలో వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోగా తాజాగా బుధవారం మరో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది.

Basara IIIT | ఇంటర్​ ఫస్టియర్​ చదువుతున్న..

నిర్మల్(Nirmal)​ జిల్లా బాసర ట్రిపుల్​ ఐటీలో ఇంటర్​ ఫస్టియర్​ చదువుతున్న సంగారెడ్డి జిల్లాకు చెందిన విద్యార్థిని బుధవారం భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే స్పందించిన​ అక్కడి అధ్యాపకులు, సిబ్బంది ఆమెను భైంసా ఆస్పత్రికి.. అక్కడి నుంచి నేరుగా నిజామాబాద్​ జిల్లా కేంద్రంలోని జీజీహెచ్​కు తరలించారు. ప్రస్తుతం ఆమె ఇంటెన్సివ్​ కేర్​లో చికిత్స పొందుతోంది. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు. బాసర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

iit basara

ఇది కూడా చదవండి : Rahul Gandhi NEET | పేపర్ లీకేజీని ఆపలేక యాప్‌లపై నిషేధమా?: రాహుల్ గాంధీ

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *