Medical Tender Transparency | పారదర్శకంగా సేవలు అందించాలి : మంత్రి రాజనర్సింహ

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Medical Tender Transparency | రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ బుధవారం సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ (CMS)ల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. CMS కేంద్రాలకు 15 శాశ్వత భవనాల నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

మందులు, సర్జికల్స్, రీజెంట్స్, ఎక్విప్మెంట్స్ కొనుగోలు చేస్తున్న టెండర్లను పారదర్శకంగా ఉండేలా విధివిధానాలను రూపొందించాలని మంత్రి రాజనర్సింహ ఆదేశించారు. టెండర్లలో పారదర్శకతను మరింత పెంచేందుకు ప్రస్తుతం ఉన్న 2 కమిటీలకు అదనంగా మరో 3 కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. సంస్థలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న అధికారులను తక్షణమే బదిలీ చేయాలని మంత్రి ఆదేశించారు.

Medical Tender Transparency | నోడల్​ ఆఫీసర్లను నియమించాలి

మందులు, ఎక్విప్మెంట్స్, సివిల్ పనులను పర్యవేక్షించడానికి తక్షణమే నోడల్ ఆఫీసర్లను నియమించాలని మంత్రి ఆదేశించారు. అన్ని స్థాయిల ఆసుపత్రులకు అవసరమైన ఎక్విప్మెంట్ కు సంబంధించి ఒక ప్రామాణిక జాబితా ను తయారు చేసి, నిర్వహించాలన్నారు. మందుల సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు, CURE ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న 2 CMS కేంద్రాలకు అదనంగా మరో 4 కొత్త CMS కేంద్రాలను ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. హిమోఫిలియా బాధితులకు నెల వారిగా అవసరమైన మందులను ఉచితంగా అందించాలని సూచించారు.

దీనిని కూడా చదవండి : Osmania Medical Ragging | ఉస్మానియా కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 12 మంది సస్పెన్షన్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *