Fake Task Force Police | టాస్క్​ఫోర్స్​ పోలీసులమని చెప్పి దోపిడీ.. ఐదుగురి అరెస్ట్​

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Fake Task Force Police | టాస్క్ ఫోర్స్ పోలీసులమని బెదిరించి ఒక బంగారం వ్యాపారిని దోపిడీ చేసిన ఐదుగురు నిందితులను అంబర్‌పేట్ పోలీసులు (Amberpet Police) అరెస్ట్ చేశారు. బాధితుడి నుండి ఆన్‌లైన్ ద్వారా నగదు వసూలు చేసిన నిందితుల వద్ద నుండి రూ.26,500 నగదు, ఫోన్లు మరియు బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Fake Task Force Police | అసలు ఏం జరిగిందంటే..

కూకట్​పల్లి (Kukatpalli)కి చెందిన హరిబాబు అనే వ్యక్తి రియల్​ ఎస్టేట్​, బంగారం వ్యాపారం చేస్తాడు. ఆయనకు గుర్తు తెలియని వ్యక్తి వాట్సాప్​లో మెసేజ్​ వచ్చింది. తన దగ్గర బంగారం ఉందని, తక్కువ ధరకు విక్రయిస్తాని అందులో పేర్కొన్నాడు. ఇది నిజమని నమ్మిన హరిబాబు బంగారం కొనుగోలు చేయాలని భావించాడు. సదరు వ్యక్తి గోల్కాక ప్రాంతంలో కలవాలని సూచించాడు.

Fake Task Force Police | పోలీసుల పేరిట దోపిడీ

హరిబాబు సదరు వ్యక్తి చెప్పిన ప్రాంతానికి వెల్లాడు. అయితే ఇద్దరు వ్యక్తులు బైక్​పై ఆయన దగ్గరకు వచ్చారు. బంగారం విక్రయించే వ్యక్తి గోల్డ్​ స్కామ్ చేశారని చెప్పారు. హరిబాబును సైతం అరెస్ట్ చేస్తామని బెదిరించారు. దీంతో భయపడిన బాధితుడు వారికి రూ.21 వేలు ఇచ్చాడు. అనంతరం మరికొంత మంది అక్కడకు వచ్చారు. వారు కూడా తాము టాస్క్​ఫోర్స్​ పోలీసులం అని చెప్పారు. బాధితుడిని కొట్టి విచారణ కోసమని బైక్​పై తీసుకు వెళ్లారు. అతడి క్రెడిట్​ కార్డు నుంచి డబ్బులు తీసుకున్నారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

దీనిని కూడా చదవండి : Medchal Lake Tragedy | ఫొటోషూట్​ కోసం చెరువులో దిగి.. ముగ్గురు యువకుల మృతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *