అక్షరటుడే, వెబ్డెస్క్ : Medchal Lake Tragedy | మేడ్చల్ జిల్లా కీసర (Keesara) పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్ కోసం ఫొటోలు దిగడానికి చెరువులో దిగిన ముగ్గురు విద్యార్థులు నీట మునిగి చనిపోయారు.
ధర్మారం గ్రామంలోని బాణమ్మ చెరువు వద్ద సరదాగా ఫొటోలు, వీడియోలు తీసుకునేందుకు ఆంటోనీ (18), జోసెఫ్ (18), టోనీ (17) అనే విద్యార్థులు వచ్చారు. అయతే ఫొటోలు దిగుతున్న క్రమంలో హెడ్‌ఫోన్స్ నీటిలో పడిపోయాయి. వాటిని తీసుకురావడానికి చెరువులోకి దిగిన యువకులు నీటిలో గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికి తీశారు. మృతులంతా బొల్లారం (Bollaram) ప్రాంతానికి చెందిన స్నేహితులు. ఒకే సారి ముగ్గురు స్నేహితులు మృతి చెందడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
Medchal Lake Tragedy | ప్రాణాలు పణంగా పెట్టొద్దు
సరదాగా వెళ్లిన స్నేహితులు ఒకేసారి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. అయితే సోషల్ మీడియా మోజులో యువత ప్రమాదకరంగా ఫొటోలు, వీడియోలు తీసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ప్రాణాలు పణంగా పెట్టి ఇలాంటి పనులు చేయొద్దని కోరుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
దీనిని కూడా చదవండి : Tamil Nadu Incident | చాక్లెట్ ఆశచూపి లైంగిక దాడి.. మూడేళ్ల చిన్నారి మృతి