Employee Health Trust | ఉద్యోగుల హెల్త్​ స్కీమ్​ కోసం ట్రస్ట్​ ఏర్పాటు

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్​ను ఏర్పాటు చేసింది. ఇందులో 30 మంది సభ్యులు ఉంటారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Employee Health Trust | ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) అమలు చేస్తామని ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే. ఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో దీనిని నిర్వహిస్తామని తెలిపిందే. ఈ మేరకు తాజాగా ట్రస్ట్​ను ఏర్పాటు చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల కోసం కొత్త హెల్త్​ స్కీమ్​ తీసుకు రానుంది. దీని కోసం ఉద్యోగుల జీతాల్లో నుంచి కొంత మొత్తం కట్ అవుతుంది. అంతేమేర ప్రభుత్వం కూడా జమ చేస్తుంది. ఈ డబ్బులు ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్ (EHCT)లో జమ అవుతాయి. వాటిని ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఆస్పత్రి పాలు అయినప్పుడు ఉపయోగిస్తారు. తాజాగా ట్రస్ట్​ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.

Employee Health Trust | ట్రస్ట్​లో 30 మంది సభ్యులు

ట్రస్ట్​లో ఛైర్మన్​తో సహా 30 మంది సభ్యులు ఉంటారు. ఛైర్మన్​గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కొనసాగుతారు. వివిధ శాఖల కార్యదర్శులు మెంబర్లుగా ఉంటారు. ఉద్యోగ సంఘాల నుంచి 10 మందిని ప్రభుత్వం సభ్యులుగా నియమించింది. ఒక్కో సంఘం నుంచి ఒక్కొక్కరిని నియమించింది. అలాగే పెన్షనర్స్​ అసోసియేషన్​ నుంచి ముగ్గురికి స్థానం కలిగించింది. ఉద్యోగుల జీతం, ప్రభుత్వం జమ చేసే నిధులను ఈ ట్రస్ట్​ నిర్వహిస్తోంది. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు త్వరలో వెలువడనున్నాయి.

ఇది కూడా చదవండి : Fake Task Force Police | టాస్క్​ఫోర్స్​ పోలీసులమని చెప్పి దోపిడీ.. ఐదుగురి అరెస్ట్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *