Food Safety Inspections | హోటళ్లు, రెస్టారెంట్లలో అధికారుల తనిఖీలు.. నోటీసులు జారీ

హైదరాబాద్​ నగరంలోని పలు రెస్టారెంట్లపై ఫుడ్​ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Food Safety Inspections | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్​ సెంటర్ల నిర్వాహకులు నిబంధనలు పాటించడం లేదు. కుళ్లిన, ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన పదార్థాలను వినియోగిస్తున్నారు. దీంతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఈ క్రమంలో ఫుడ్​ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

కూకట్‌పల్లిలోని బేక్ మ్యాక్స్ ఫుడ్స్ (బ్రౌన్ బేర్)లో గురువారం అధికారులు తనిఖీలు చేశారు. కిచెన్​లో బొద్దింకలు, తుప్పు పట్టిన బేకింగ్ ట్రేలు, లేబెలింగ్ లోపాలు వంటి పలు ఉల్లంఘనలు గుర్తించారు. ఆహార నమూనాలను సేకరించిన అధికారులు షోకాజ్ నోటీసు జారీకి నిర్ణయించి, పరిశుభ్రత ప్రమాణాలను మెరుగుపరచాలని ఆదేశించారు.

Food Safety Inspections | మాంసం నిల్వ

అంజయ్యనగర్‌లోని నవాబ్స్ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో పలు పరిశుభ్రత లోపాలు బయటపడ్డాయి. ఫ్రీజర్లలో పాత మాంసాహార, ఆహార పదార్థాలు నిల్వ చేయడం, లేబులింగ్ లేకపోవడం, పరిశుభ్రత ప్రమాణాలు పాటించకపోవడం గుర్తించారు. హైజీన్ స్కోర్ 71 శాతం నమోదవడంతో ఇంప్రూవ్‌మెంట్ నోటీస్ జారీ చేస్తామని అధికారులు తెలిపారు.

Food Safety Inspections | ఆహారంలో పురుగులు

సైబరాబాద్‌లోని ‘ది స్పైస్ కిచెన్’ రెస్టారెంట్‌లో పరిశుభ్రత లోపాలను అధికారులు గుర్తించారు. ఫ్రీజర్, స్టోరేజ్ ప్రాంతాల్లో బొద్దింకలు, నిల్వ చేసిన ఆహారంలో పురుగులు, పాత ఆహార పదార్థాలు గుర్తించారు. పరిశుభ్రత, పెస్ట్ కంట్రోల్, ఆహార నిల్వ విధానాల్లో తక్షణ సవరణలు చేపట్టాలని ఆదేశించారు. బహార్ కేఫేలో కిచెన్ పరిశుభ్రత సరిగా లేకపోవడం, ఆహార పదార్థాలకు లేబులింగ్ లేకపోవడం, సిబ్బంది మెడికల్ రికార్డులు అందుబాటులో లేకపోవడంతో షోకాజ్ నోటీసు జారీ చేశారు. కిచెన్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించారు.

ఇది కూడా చదవండి : Rayadurgam Land Auction | రాయదుర్గం భూముల వివాదం.. వేలం ప్రక్రియపై హైకోర్టు స్టే

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *