Bihar Incident | బీహార్​లో ఘోరం.. వివాహితపై గ్యాంగ్​ రేప్

బీహార్‌లోని బెగుసరాయ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఐదుగురు నిందితులు ఓ వివాహితపై సామూహిక అత్యాచారం చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bihar Incident | బీహార్‌లోని బెగుసరాయ్‌లో ఐదుగురు వ్యక్తులు ఒక ఇంట్లోకి చొరబడి, ఇంటి యజమానిని గదిలో బంధించి, అతని భార్యపై దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు కడుపు కింది భాగంలో తీవ్రమైన నొప్పితో ఆసుపత్రిలో చేరారు. చికిత్స సమయంలో, ఆమె ప్రైవేట్ పార్ట్స్​ నుంచి ఒక బుల్లెట్, రాయి, చెక్క ముక్కను వైద్యులు తొలగించారు. నిందితులు ఎంత క్రూరంగా వ్యవహరించారో దీనిని బట్టి తెలుస్తోంది.

bihar

బీహార్​లో ఈ ఘటన జూన్ 11న చకియా పోలీస్ స్టేషన్ (Chakiya Police Station) సమీపంలో జరిగింది. రాత్రి 11:30 గంటల సమయంలో తాను మరుగుదొడ్డికి వెళ్లినప్పుడు, ఐదుగురు వ్యక్తులు బలవంతంగా ఇంట్లోకి చొరబడి తన భర్తను ఒక గదిలో బంధించారని బాధితురాలు తెలిపారు. ఆమె బయటకు రాగానే, వారు నోరు మూసివేశారు. దాడి చేసినవారు ఆమెను ఇంటి బయట ఉన్న నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఆమె కేకలు వేయడానికి ప్రయత్నించినప్పుడు, వారు బ్లేడ్‌తో దాడి చేశారు.

Bihar Incident | మూడు నెలల క్రితం

మూడు నెలల క్రితం ముగ్గురు దుండగులు తన ఇంట్లోకి చొరబడి తనను కొట్టారని ఆమె చెప్పారు. డబ్బు, నగలతో పారిపోయే ముందు లైంగిక దాడికి కూడా ప్రయత్నించారని పేర్కొన్నారు. పోలీసులకు సమాచారం అందించినప్పటికీ, వారు ఎటువంటి చర్య తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని డీఎస్పీ ఆనంద్ కుమార్ పాండే తెలిపారు. నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని ఆయన తెలిపారు. నిర్లక్ష్యానికి పాల్పడినట్లు తేలితే పోలీసులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

దీనిని కూడా చదవండి : Rajya Sabha Election | రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్​ షాక్​.. బీజేపీ మద్దతు గల అభ్యర్థి విజయం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *