అక్షరటుడే, భిక్కనూరు : Nagaraju Appointment | తెలంగాణ ఆర్య వైశ్య మహాసభ రాష్ట్ర మీడియా కమిటీ వైస్ ఛైర్మన్‌గా భిక్కనూరుకు చెందిన గజవాడ నాగరాజు నియమితులయ్యారు. ఈ మేరకు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ ఆదేశాలు జారీ చేశారు.
Nagaraju Appointment | భిక్కనూరులో..

భిక్కనూరు (Bikhnoor)లో శుక్రవారం ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు, రీజినల్ ఛైర్మన్ శనిశెట్టి గౌరీశంకర్ నియామక పత్రాన్ని గజవాడ నాగరాజుకు అందజేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ ఆర్య వైశ్య మహాసభ ఆశయాలను నెరవేరుస్తానన్నారు. తనను నియమించినందుకు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీ నారాయణ, ఉపాధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు, రీజినల్ ఛైర్మన్ గౌరీశంకర్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో భిక్కనూరు ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్, కోశాధికారి కోడిప్యాక వెంకటేశం, ప్రతినిధులు పబ్బ నాగరాజు, చీకోటి నాగభూషణం, గంగెల్లి మధుసూదన్, పబ్బ కిరణ్, గంజి శ్రీనివాస్, శ్రీరామ్ కృష్ణమూర్తి, సిద్దగిరి, అతిమముల రమేష్, గౌరీశెట్టి రవి కుమార్, జగదీశ్వర్, రమేష్, రాజయ్య, చంద్రమౌళి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: BRS Urea Protest | కొత్త ఊపులో గులాబీదళం.. యూరియా పోరుతో క్షేత్రబాట..