Gadugu Gangadhar | గడుగు గంగాధర్​ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే బిగాల

నగరంలో తెలంగాణ వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ ఇంట్లో గురువారం రాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆయనను మాజీ ఎమ్మెల్యే బిగాల పరామర్శించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Gadugu Gangadhar | నగరంలో తెలంగాణ వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ ఇంట్లో గురువారం రాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఘటన జరిగింది.

Gadugu Gangadhar | గడుగు ఇంటికి వెళ్లిన బిగాల..

Gadugu Gangadhar

గడుగు గంగాధర్ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగిందని తెలుసుకున్న నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్​ గుప్తా (Bigala Ganesh Guptha) శుక్రవారం ఆయన ఇంటికి వెళ్లారు. గడుగును వారి కుటుంబ సభ్యులను కలిసి విచారం వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. అనంతరం దగ్ధమైన ఇంటిని పరిశీలించారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ పీపీ ఆకుల రమేష్​, బీఆర్ఎస్ నాయకులు శిల్పరాజు, ప్రభాకర్ రెడ్డి, సత్య ప్రకాష్, సూత్ సింగ్ ఠాకూర్, దండు శేఖర్, జగత్ రెడ్డి, ప్యాట సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Nagaraju Appointment | ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర మీడియా వైస్ ఛైర్మన్​గా నాగరాజు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *