అక్షరటుడే, వెబ్‌డెస్క్: Jio AI Agent | రిలయన్స్ మరో సంచలనం సృష్టించబోతోంది. భారత టెలికాం ప్రపంచంలో కొత్త విప్లవం తీసుకురాబోతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు సాధారణ కాల్స్‌లోనే భాగమై, దైనందిన జీవితాన్ని మరింత సులభం చేయబోతోంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence)ను తన వినియోగదారులకు మరింత చేరువ చేసేలా జియో కాల్‌లో ఏఐ ఏజెంట్ సదుపాయాన్ని తీసుకొస్తున్నట్లు జియో ప్లాట్‌ఫాం మేనేజింగ్ డైరెక్టర్ ఆకాశ్ అంబానీ (Akash Ambani) ఏజీఎంలో ప్రకటించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఎలాంటి యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని, ఫోన్ కాల్‌లో ఉన్నప్పుడు ‘హే జియో’ అంటే చాలు.. జియో కాల్ ఏజెంట్ యాక్టివేట్ అవుతుందని పేర్కొన్నారు. ఈ సౌలభ్యం ఈ ఏడాది చివరికల్లా జియో యూజర్లందరికీ జియో కాల్ ఏజెంట్‌ను అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించారు.
Jio AI Agent | అడ్వైజర్‌గా..

కొత్త ఏఐ ఏజెంట్ కోసం మై జియో యాప్‌లో మార్పులు చేయనున్నారు. మొబైల్ రీచార్జి, అకౌంట్ బ్యాలెన్స్, సర్వీసులను మేనేజ్ చేయడానికి మాత్రమే ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఈ యాప్.. ఇకపై పర్సనల్ ఏఐ అడ్వైజర్, రిలేషన్‌షిప్ మేనేజర్‌గానూ వ్యవహరించనుంది. మీకేం కావాలో చెప్తే ఈ ఏఐ అసిస్టెంట్ ఆ పని చేసి పెడుతుంది. ఈ ఏఐ ఏజెంట్ కాల్స్ రియల్ టైమ్‌లో సంభాషణలను ట్రాన్స్‌క్రైబ్ చేస్తుంది. కాన్ఫరెన్స్ కాల్స్ తర్వాత.. సారాంశం, చేయాల్సిన పనుల జాబితా, రిమైండర్లు తయారు చేసి కాల్‌లో పాల్గొన్న వారికి షేర్ చేస్తుంది. లైవ్ కాల్ సమయంలోనే ఈ ఏఐ అసిస్టెంట్ యూజర్ తరఫున క్యాబ్ బుక్ చేయడం, ఫుడ్ ఆర్డర్ చేయడం, రెస్టారెంట్‌లో టేబుల్ బుక్ చేయడం వంటి పనులూ చేయనుంది. ఇది అన్ని భారతీయ భాషలకు మద్దతు ఇవ్వనుంది.
ఇది కూడా చదవండి..: Jio IPO Announcement | ఐపీవోకు రిలయన్స్ జియో.. ముకేశ్ అంబానీ కీలక ప్రకటన