బిజినెస్​April 23 Gold Rates | బంగారం ధరలకు బ్రేక్.. త‌గ్గుముఖం ప‌ట్టిన‌ వెండి

April 23 Gold Rates | బంగారం ధరలకు బ్రేక్.. త‌గ్గుముఖం ప‌ట్టిన‌ వెండి

భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, డాలర్ బలపడటం ప్రభావంతో దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఈ వారం తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి.

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 23 Gold Rates | భారత్‌లో బంగారం ధరలు ఈ వారం స్వల్పంగా తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, డాలర్ బలపడటం వల్ల పసిడి ధరపై ఒత్తిడి పెరిగింది. దీంతో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుదల దిశగా కదులుతున్నాయి.

హైద‌రాబాద్ Hyderabad బులియన్ మార్కెట్‌లో నేడు (ఏప్రిల్ 23) ఉదయం 6:30 గంటల సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,740గా నమోదైంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ఆభరణాల బంగారం ధర రూ.1,41,840 వద్ద కొనసాగుతోంది.

April 23 Gold Rates | త‌గ్గుతున్న ధ‌ర‌లు..

వెండి ధరల విషయానికి వస్తే, ఈ వారం ప్రారంభం నుంచి కొంతమేర తగ్గుదల కనిపిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,74,900గా ఉంది. అయితే ఇది భారీ పతనం కాకపోయినా, మార్కెట్‌లో కొంత స్థిరత్వం నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇతర ప్రధాన నగరాల్లో కూడా బంగారం ధరల్లో స్వల్ప తేడాలు కనిపిస్తున్నాయి.

చెన్నైChennaiలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,450గా గరిష్ఠ స్థాయిలో ఉంది. ఢిల్లీలో రూ.1,54,890గా ఉండగా, ముంబై, కోల్‌క‌తా Kolkata నగరాల్లో రూ.1,54,740గా కొనసాగుతోంది.

ఆభరణాల బంగారం ధరలు కూడా ఇదే ధోరణిని అనుసరిస్తున్నాయి. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,42,490గా ఉండగా, ఢిల్లీలో రూ.1,41,990గా ఉంది. ముంబై, కోల్‌కతాలో మాత్రం రూ.1,41,840 వద్ద కొనసాగుతోంది.

April 23 Gold Rates | ఈ వారం సగటున

దేశవ్యాప్తంగా వెండి ధరలు Silver Prices ఈ వారం సగటున రూ.10,000 వరకు తగ్గినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం వివిధ నగరాల్లో కిలో వెండి ధర రూ.2.64 లక్షల నుంచి రూ.2.74 లక్షల మధ్య ఊగిస‌లాడుతుంది.

మొత్తంగా చూస్తే, అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ మారకం విలువల మార్పులు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. రాబోయే రోజుల్లో గ్లోబల్ మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఈ ధరల్లో మరింత మార్పులు వచ్చే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Jacqueline Sukesh letter | లవ్ యూ బుట్ట బొమ్మ జాక్వీ.. ప్రేమతో బేబీ బాయ్ సుఖేశ్!

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

DJ Sound | డీజే శబ్దం భరించలేక 140 కోళ్లు మృతి.. ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర ఘటన

అక్షరటుడే, వెబ్​డెస్క్: DJ Sound | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలోని...

Bellamkonda Wedding | రుమలలో ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వివాహం.. కావ్య రెడ్డితో కొత్త జీవితానికి శ్రీకారం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bellamkonda Wedding | తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక...

April 30 Gold Rates | మ‌రింత త‌గ్గుతున్న బంగారం ధ‌ర‌.. కొనుగోలుదారులకు ఊరట!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Gold Rates | అంతర్జాతీయ మార్కెట్‌లో...

April 30 Horoscope | సమాజంలో పెరగనున్న కీర్తి ప్రతిష్ఠలు.. ఈ రాశుల వారి వ్యక్తిత్వానికి ఫిదా అవ్వాల్సిందే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Horoscope | ఇవాళ గ్రహ గతులను బట్టి...