NEET Exam Arrangements | జిల్లాలో ‘నీట్​’కు పక్కాగా ఏర్పాట్లు..

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నీట్ పరీక్షకు పక్కగా ఏర్పాటు చేశామని జిల్లా పోలీసు శాఖ తెలిపింది.

Shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: NEET Exam Arrangements | నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ‘నీట్’కు పక్కగా ఏర్పాటు చేశామని జిల్లా పోలీసు శాఖ (Police Department) తెలిపింది. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేసింది.

NEET Exam Arrangements | జిరాక్స్​ సెంటర్లు మూసివేయాలి

జిల్లాలోని పరీక్ష కేంద్రాల్లో ‘నీట్​’కు పటిష్టమైన పోలీసు భద్రత కల్పించామని అధికారులు తెలియజేశారు. ఆదివారం పరీక్ష జరగనున్న గిరిరాజు కళాశాల, డిచ్​పల్లి తెలంగాణ యూనివర్సిటీ, గవర్నమెంట్ జూనియర్ కళాశాల బోధన్, నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాల, మాక్లూర్ బిగాల కృష్ణమూర్తి జిల్లా పరిషత్ హైస్కూల్, తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ నాగారంలలో పూర్తి ఏర్పాట్లు చేసినట్లు వారు పేర్కొన్నారు. పరీక్ష జరిగే సమయాల్లో పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాల చుట్టూ 100 మీటర్ల పరిధిలో ఇద్దరికి మించి గుమిగూడడం పూర్తిగా నిషేధించినట్లు అధికారులు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల సమీపంలో ఇంటర్నెట్ సెంటర్లు. జిరాక్స్, స్టేషనరీ దుకాణాలను పూర్తిగా మూసివేయాలని యజమానులకు సూచనలు జారీ చేసినట్లు వారు తెలిపారు.

NEET Exam Arrangements

ఇది కూడా చదవండి..: Farmer Welfare Telangana | ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు..

 

 

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *