అక్షరటుడే వెబ్డెస్క్: Adilabad Farmer Suicide | ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం పొన్న గ్రామంలో, జొన్న పంటను కొనుగోలు చేయడంలో జరిగిన ఆలస్యం కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన రైతు నుగూరే పాండురంగ్ కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి పార్టీ తరపున అండగా ఉంటామని భరోసా కల్పించారు.
Adilabad Farmer Suicide | అధికారులు నిర్లక్ష్యం..
పొన్న గ్రామానికి చెందిన రైతు నుగూరే పాండురంగ్ (48) తాను సాగు చేసిన 35 క్వింటాళ్ల జొన్నలను విక్రయించేందుకు మే 23న సిరికొండలోని కొనుగోలు కేంద్రానికి తరలించారు. అక్కడ తూకం వేసి లాట్ నంబర్ కేటాయించినప్పటికీ, రోజుల తరబడి లారీలో లోడ్ చేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహించారు. హమాలీలు అదనపు డబ్బులు డిమాండ్ చేయడం, అధికారులు పట్టించుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన పాండురంగ్, కొనుగోలు కేంద్రంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.
Adilabad Farmer Suicide | రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఇదే..
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. “రాష్ట్రంలోని ప్రతి రైతు పరిస్థితి ఇలాగే తయారైంది. పంటలను సకాలంలో కొనక రైతును అప్పుల ఊబిలోకి నెడుతున్నారు. పాండురంగ్ కుటుంబానికి కనీసం రుణమాఫీ కాలేదు, రైతుబంధు కూడా అందడం లేదు” అని కేటీఆర్ విమర్శించారు. అన్నదాతల పట్ల ప్రభుత్వానికి కనీస బాధ్యత లేదని, అధికారులు రైతు సమస్యలను పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు.
Adilabad Farmer Suicide | ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహం..
పాండురంగ్ మృతికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. కష్టపడి పండించిన పంటను అమ్ముకోలేక ఒక రైతు ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని, దీనికి బాధ్యత వహించే అధికారి ఒక్కరు కూడా రైతును పలకరించకపోవడం దారుణమని కేటీఆర్ తప్పుబట్టారు.
పంట కొనలేదని రైతు విషం తాగి పడిపోతే ఒక్క అధికారి కూడా పట్టించుకోలేదు: కేటీఆర్
ఆదిలాబాద్ జిల్లాలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటిస్తున్నారు. సిరికొండ మండలం పొన్న గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం పంట కొనక పోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న రైతు నుగూరే పాండురంగ్… pic.twitter.com/7nvbPmKIvD
— Akshara Today | Telugu News (@aksharatoday) June 20, 2026
ఇది కూడా చదవండి: NEET Exam Arrangements | జిల్లాలో ‘నీట్’కు పక్కాగా ఏర్పాట్లు..