అక్షరటుడే వెబ్‌డెస్క్: Narahari Illegal Assets | తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) చరిత్రలో ఇదొక సంచలన కేసుగా నమోదైంది. ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరిపై ఇటీవల నమోదు చేసిన అక్రమాస్తుల కేసులో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. తాజాగా ఆయనకు చెందిన బ్యాంక్ లాకర్లలో మరో కోటిన్నర రూపాయల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Narahari Illegal Assets | రూ. 3 కోట్ల నగదు సీజ్..
నరహరిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న సమయంలో, ఆయన నివాసంలో మంచం కింద , ఇతర రహస్య ప్రాంతాల్లో దాచి ఉంచిన రూ. 1.5 కోట్ల నగదును ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. తాజాగా సోదాల్లో భాగంగా ఆయనకు చెందిన లాకర్లను తెరవగా, అందులో మరో రూ. 1.5 కోట్లు బయటపడ్డాయి. దీంతో ఇప్పటివరకు కేవలం నగదు రూపంలోనే రూ. 3 కోట్లను అధికారులు సీజ్ చేశారు.
Narahari Illegal Assets | బ్యాంక్ ఖాతాల్లో భారీగా బ్యాలెన్స్..
కేవలం ఇంట్లో దొరికిన నగదు మాత్రమే కాకుండా, నరహరికి చెందిన వివిధ బ్యాంక్ ఖాతాలను పరిశీలించిన ఏసీబీ అధికారులు, వాటిలో ఉన్న రూ. 5 కోట్లను కూడా ఫ్రీజ్ చేశారు. అంటే, ఇప్పటివరకు లెక్క తేలిన అక్రమాస్తుల విలువ సుమారు రూ. 8 కోట్లకు పైగా ఉంది.
Narahari Illegal Assets | మరిన్ని లాకర్ల తనిఖీకి సన్నాహాలు..
ఈ కేసులో ఇంకా కీలకమైన రెండు లాకర్లను తెరవాల్సి ఉందని ఏసీబీ వర్గాలు తెలిపాయి. ఆ లాకర్లలో కూడా భారీగా నగదుతో పాటు, భూములు , ఇతర ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలు దొరికే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ దాడుల నేపథ్యంలో డిప్యూటీ డైరెక్టర్ నరహరి అక్రమ సంపాదన లెక్కలు ఎంతవరకు వెళ్తాయోనని రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఏసీబీ చరిత్రలోనే సంచలనం..
తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే ఇదో సంచలన కేసు. ఇటీవల ఏసీబీకి చిక్కిన ల్యాండ్ అండ్ మైన్స్ డిప్యూటీ డైరెక్టర్ నరహారి లాకర్లలో మరో కోటిన్నర స్వాధీనం. ఇంట్లో మంచం కింద, ఇతర ప్రాంతాల్లో ఇప్పటికే దొరికిన కోటిన్నర నగదు. మొత్తంగా రూ.3 కోట్ల నగదు… pic.twitter.com/vBIcJy8Ulb
— Akshara Today | Telugu News (@aksharatoday) June 20, 2026
ఇది కూడా చదవండి: Telangana University Appointments | అధ్యాపకుల నియామకాలు తప్పు పట్టడం తగదు