తెలంగాణTelangana Heatwave Alert | రేపటి నుంచి మండనున్న ఎండలు.. ఉత్తర తెలంగాణకు రెడ్​ అలెర్ట్​

Telangana Heatwave Alert | రేపటి నుంచి మండనున్న ఎండలు.. ఉత్తర తెలంగాణకు రెడ్​ అలెర్ట్​

రాష్ట్రంలో రేపటి నుంచి హీట్​వేవ్​ మొదలు కానుంది. పలు జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Heatwave Alert | రాష్ట్రంలో మళ్లీ ఎండలు దంచి కొడుతున్నాయి. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో (Unseasonal Rains) కాస్త చల్లబడిన వాతావరణం.. మళ్లీ వేడెక్కింది. గురువారం నుంచి ఎండ తీవ్రత పెరగనుంది. అయితే శుక్రవారం నుంచి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

రాష్ట్రంలో రేపటి నుంచి హీట్​వేవ్​ (Heatwave) మొదలు కానుంది. ఏప్రిల్ 24-29 వరకు భానుడు భగభగ మండుతాడు. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరే అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్​, ఉమ్మడి కరీంనగర్​, నిజామాబాద్​, భూపాలపల్లి, ములుగు, ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్​, సూర్యాపేట, నల్గొండ, గద్వాల, వనపర్తి జిల్లాల్లో 43 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉంది. దీంతో ఆ జిల్లాలకు అధికారులు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. మిగతా జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీల మధ్య టెంపరేచర్​ రికార్డు అయ్యే ఛాన్స్​ ఉంది.

Telangana Heatwave Alert | హైదరాబాద్​లో…

హైదరాబాద్ (Hyderabad) తీవ్రమైన వడగాలుల బారిన పడనుంది. ఏప్రిల్ 24-29 తేదీల మధ్య కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 43°Cకి చేరవచ్చు. వేడి కారణంగా అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఈ వర్షాలతో గాలిలో తేమ పెరిగి ఉక్కపోతను పెంచుతాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లొద్దు. నీరు ఎక్కువగా తాగాలి. జంక్​ ఫుడ్​, మద్యపానం, దూమపానానికి దూరంగా ఉండాలి. మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లాల్సి వస్తే తలకు ఎండ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇది కూడా చదవండి..: RTC Strike Issues | కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె.. ప్రైవేట్​ వాహనాల దోపిడీ

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....