అక్షరటుడే, వెబ్‌డెస్క్: KBR Park One Way Trial | హైదరాబాద్ (Hyderabad) నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. ఇందులో భాగంగా కేబీఆర్ పార్కు వద్ద అండర్‌పాస్‌లు, ఫ్లై ఓవర్లు నిర్మిస్తున్నారు. పనుల నేపథ్యంలో కేబీఆర్ పార్క్ వన్-వే ట్రయల్ రన్ 2 కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు.
కేబీఆర్ పార్క్ వద్ద ఏప్రిల్ 5న నిర్వహించిన మొదటి ట్రయల్‌లో గుర్తించిన సమస్యలను పరిష్కరించిన తర్వాత.. తాజాగా మరోసారి నిర్వహించినట్లు సీపీ తెలిపారు. ఆయన సిబ్బందితో కలిసి పార్క్ వద్ద ట్రాఫిక్‌ను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. కేబీఆర్ పార్క్ వన్-వే ట్రాఫిక్ ట్రయల్ రెండవ దశను ప్రారంభించినట్లు తెలిపారు. ట్రాఫిక్ రద్దీ తక్కువగా ఉండే వేసవి కాలంలో మొదటి ట్రయల్ నిర్వహించామన్నారు. ఆదివారం అయినప్పటికీ, రెండవ ట్రయల్ సమయంలో ట్రాఫిక్ ప్రవాహాన్ని నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
KBR Park One Way Trial | పోలీసులకు సహకరించాలి

ట్రాఫిక్ నిర్వహణ కోసం గ్రేహౌండ్స్, ఆక్టోపస్ బృందాల మద్దతుతో సుమారు 150 మంది ట్రాఫిక్ సిబ్బందిని మోహరించినట్లు సీపీ (CP Sajjanar) తెలిపారు. ఆ ప్రాంతమంతటా సైన్‌బోర్డులను ఏర్పాటు చేశామన్నారు. వాహనదారులు ట్రాఫిక్ సూచనలను పాటించాలని, పోలీసులకు సహకరించాలని కోరారు. రద్దీని తగ్గించడానికి కేబీఆర్ పార్క్ చుట్టూ ఏడు ఫ్లైఓవర్లు, ఏడు అండర్‌పాస్‌లను నిర్మించనున్నట్లు వెల్లడించారు. పాదచారులు సురక్షితంగా రోడ్డు దాటేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. KBR పార్క్‌కు వచ్చే సందర్శకులు రోడ్డు పక్కన వాహనాలు నిలపడానికి ఇకపై అనుమతి ఉండదన్నారు. వన్-వే ట్రయల్, ట్రాఫిక్ మళ్లింపుల ప్రభావాన్ని అంచనా వేస్తామని, అలాగే రోడ్డు వెడల్పు, యూ-టర్న్ జ్యామితి వంటి అంశాలను మెరుగుపరుస్తామని అదనపు సీపీ (ట్రాఫిక్) జోయెల్ డేవిస్ తెలిపారు.
ఇది కూడా చదవండి..: Rajanarasimha Yoga Message | యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలి : మంత్రి రాజనర్సింహ