Medchal Fire Accident | మేడ్చల్ కెమికల్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Medchal Fire Accident | మేడ్చల్ కెమికల్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆర్గ్ కెమ్ కెమికల్ కంపెనీలో మంగళవారం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.

రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ క్రమంలో అగ్ని నిత్యం అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మేడ్చల్ పోలీస్ స్టేషన్ (Medchal Police Station) పరిధిలోని ఆర్గ్ కెమ్ కెమికల్ కంపెనీలో ప్రమాదం జరగ్గా.. భారీగా ఆస్తి నష్టం జరిగింది. మంటలు, దట్టమైన పొగలు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేస్తున్నారు.

Medchal Fire Accident | ట్రాన్స్‌ఫార్మర్ కంపెనీలో..

సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని కేపీఎల్ ట్రాన్స్‌ఫార్మర్ కంపెనీలో అగ్నిప్రమాదం జరిగింది. వ్యర్థాలను తగలబెట్టే క్రమంలో మంటలు చెలరేగాయి. దీంతో కార్మికులు భయాందోళనతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

Medchal Fire Accident | టిప్పర్​ దగ్ధం

జగిత్యాలలో టిప్పర్​ దగ్ధం అయింది. నర్సింగాపూర్ బైపాస్‌ మల్లన్న గుడి దగ్గర టిప్పర్ కాలిపోయింది. షార్ట్ సర్య్కూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వరుస అగ్ని ప్రమాదాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఇది కూడా చదవండి..: ACB Raids | జలమండలి జీఎం ఇంట్లో ఏసీబీ సోదాలు.. ఆస్తులు చూసి షాకైన అధికారులు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *